తెలుగు ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం “ఆర్ఆర్ఆర్”. ఈ సినిమాలో టాలీవుడ్ హీరో లైనా మెగా రామ్ చరణ్ తేజ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. రామ్ చరణ్, అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించగా ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్నట్లు మనకు తెలిసిందే.అయితే ఇప్పటికే ఈ ఇద్దరి పాత్రలకు సంబంధించిన టీజర్ లు చిత్ర బృందం విడుదల చేశారు.అయితే ఈ చిత్రం ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందనే ఆతృతతో అటు మెగా అభిమానులు,ఇటు ఎన్టీఆర్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం వీరి అభిమానులకు చిత్రబృందం శుభవార్తను తెలియజేసింది.

ఇప్పటికీ షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం అక్టోబర్ 13న దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా ఈ సినిమా కు సంబంధించి కొత్త పోస్టర్ ని కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్ లో అల్లూరి సీతారామరాజు (రామ్ చరణ్) గుర్రంపై స్వారీ చేస్తూ ఉండగా, కొమరం భీమ్ (ఎన్టీఆర్) బుల్లెట్ నడుపుతూ కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

బాన్ ఇండియన్ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అల్లు సీతారామరాజు పాత్ర పోషిస్తున్న రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బామ అలియా భట్ సీత పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానున్నారు. అదేవిధంగా కొమరం భీమ్ పాత్రలో పోషిస్తున్న ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ బామ ఒలీవియా మోరీస్ సందడి చేయనున్నారు. అలిసన్‌ డూడీ, రే స్టీవెన్‌ సన్ ప్రధానపాత్రల్లో కనిపించనున్నారు. అంతేకాకుండా ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్, శ్రీయ, సముద్రఖని ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని దాదాపు నాలుగు వందల కోట్ల బడ్జెట్టు డి.వి.వి.దానయ్య ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.ప్రస్తుతం ఈ చిత్రం విడుదల చేసిన పోస్టర్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here