Ramcharan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా గ్లోబల్ స్టార్ గా వరుస సినిమాలలో నటిస్తూ ఈయన ఒక్కో సినిమాకు దాదాపు 100 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు. అంతేకాకుండా మెగాస్టార్ వారసుడిగా కొన్ని వేల కోట్లకు రామ్ చరణ్ అధిపతి. ఇలా ఈయన బైబర్త్ గోల్డెన్ స్పూన్ తోనే పుట్టారని చెప్పాలి.

ఈ విధంగా రాంచరణ్ స్టార్ హీరోగా కొనసాగుతూ ఉన్నప్పటికీ ఒక్కో సినిమాకి 100 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఉన్నప్పటికీ ఆయన ఫస్ట్ రెమ్యూనరేషన్ మాత్రం ఎప్పటికీ ఎంతో ప్రత్యేకమని తెలియజేశారు. రామ్ చరణ్ మొదటి సారి చిరుత సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోగా పరిచయమయ్యారు.
పూరి జగన్నాథ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ద్వారా రామ్ చరణ్ నటుడుగా మంచి గుర్తింపు పొందారు. అయితే ఈ సినిమా కోసం రాంచరణ్ తీసుకున్నటువంటి రెమ్యూనరేషన్ ఏం చేశారనే విషయాన్ని చాలా రోజుల తర్వాత బయటపెట్టారు. రామ్ చరణ్ ఈ సినిమా కోసం తీసుకున్న రెమ్యూనరేషన్ తో తనకు ఎంతో ఇష్టమైనటువంటి వాచ్ ని కొనుగోలు చేశారని తెలుస్తోంది.

Ramcharan వాచ్ కొనుగోలు చేసిన చరణ్…
ఈ విధంగా రామ్ చరణ్ కు వాచ్ లంటే చాలా పిచ్చి ఆయన ఎక్కడికి వెళ్లినా ఎంతో ఖరీదైన వాచ్ లను కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇలా ఇప్పటికే కొన్ని కోట్ల రూపాయల విలువ చేసే వాచ్ లను రాంచరణ్ వద్ద ఉన్నాయని తెలుస్తుంది.ఈ క్రమంలోనే తన ఫస్ట్ రెమ్యూనరేషన్ తో కూడా ఈయన ఒక ఖరీదైన వాచ్ కొనుగోలు చేశారంటూ ఓ సందర్భంలో రామ్ చరణ్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.