Ramcharan: హాలీవుడ్ సినిమాలు చేస్తే దర్శకులకు ఆ కండిషన్ తప్పనిసరి: రామ్ చరణ్

0
22

Ramcharan: మెగా పవర్ స్టార్,గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం కాశ్మీర్లో జరుగుతున్న g20 సదస్సులో పాల్గొన్న విషయం మనకు తెలిసిందే.మే 22 నుంచి మూడు రోజులు పాటు జరిగే ఈ వేడుకలలో రామ్ చరణ్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ తరపున హాజరయ్యారు. ప్రస్తుతం ఈ కార్యక్రమంలో పాల్గొంటూ వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా రామ్ చరణ్ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ.. మన ఇండియాలో ఎంతో అందమైన లొకేషన్లో ఉన్నాయి. కాశ్మీర్ లాంటి అందమైన లొకేషన్లో ఈ సదస్సు ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా అనిపిస్తుందని రామ్ చరణ్ తెలియజేశారు.

మన ఇండియాలో కేరళ కాశ్మీర్ వంటి ఎన్నో ఆహ్లాదకరమైన ప్రాంతాలు ఉన్నాయని ఈ ప్రాంతాలన్నింటిని తాను సినిమాల ద్వారా ప్రేక్షకులకు చూపించాలనుకుంటున్నానని చరణ్ తెలిపారు.ఇకపై లొకేషన్ ల కోసమే ఇతర దేశాలకు వెళ్లకూడదని నిర్ణయాన్ని నేను తీసుకుంటున్నానని రామ్ చరణ్ తెలిపారు.

Ramcharan: నార్త్ సౌత్ తేడాలు లేవు…


ఇక తాను భవిష్యత్తులో హాలీవుడ్ సినిమాలు చేసిన హాలీవుడ్ దర్శకులకు కూడా తాను ఇదే కండిషన్ పెడతానని, హాలీవుడ్ దర్శకులకి కూడా ఇండియాలో ఉండే ప్రకృతి అందాలను చూపిస్తాను అంటూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇండియాలో నార్త్ సౌత్ అని రెండు సినిమాలు లేవు ఉన్నది ఒక్కటే అది ఇండియన్ సినిమా అంటూ ఈ సందర్భంగా చరణ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.