Ramgopal Varma: రాంగోపాల్ వర్మ పరిచయం అవసరం లేని పేరు సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలిచే ఈయన తరచూ ఏదో ఒక వివాదాస్పదమైన వ్యాఖ్యల ద్వారా వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఇలా దర్శకుడిగా ఒకానొక సమయంలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వర్మ ఈ మధ్యకాలంలో తన ఫోకస్ సినిమాలపై పూర్తిగా తగ్గిందని చెప్పాలి.

ఇలా అడపా సినిమాలు చేస్తూ కాంట్రవర్సీలో నిలుస్తున్నటువంటి వర్మ తాజాగా విజయవాడ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అకాడమిక్ ఎగ్జిబిషన్ కి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన తన ఇంజనీరింగ్ సర్టిఫికెట్ అందుకున్నారు. ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ వరుసగా ట్వీట్స్ చేశారు.
విజయవాడలోని వి ఆర్ సిద్దార్థ ఇంజనీరింగ్ కాలేజీలో RGV బిటెక్ సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. అయితే ఈయన తన ఇంజనీరింగ్ పూర్తి అయ్యి 37 సంవత్సరాలు అవుతున్న ఇప్పటివరకు తన ఇంజనీరింగ్ సర్టిఫికెట్ అందుకోలేదు. అయితే ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్నటువంటి వర్మకు తన ఇంజనీరింగ్ సర్టిఫికెట్ అందించారు. ఈ క్రమంలోనే ఈ ఫోటోని షేర్ చేస్తూ బిటెక్ పాస్ అయిన 37 ఏళ్ళ తరువాత నా డిగ్రీ అందుకోవడం చాలా థ్రిల్ గా ఉంది.థాంక్యూ నాగార్జున యూనివర్సిటీ అంటూ ఈయన తన మార్క్స్ కార్డ్ షేర్ చేశారు. అయితే ఈయన సెకండ్ క్లాస్ లో పాస్ అయినట్టు తెలుస్తుంది.

Ramgopal Varma: వాళ్లను చెడగొట్టాలని ప్రయత్నం చేశా…
యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఈయనకు పుష్పగుచ్చం అందిస్తూ గౌరవించారు. అలాగే యూనివర్సిటీ ప్రొఫెసర్లతో కలిసి ఈయన మాట్లాడుతున్నటువంటి ఫోటోలను కూడా షేర్ చేస్తూ.. బాగా చదువుకున్న ప్రొఫెసర్ల మధ్య చదువుకొని నేను అంటూ ట్వీట్ చేశారు. అలాగే యూనివర్సిటీ విద్యార్థులతో మాట్లాడుతూ ఉన్నటువంటి ఫోటోని షేర్ చేస్తూ… వాళ్లను చెడగొట్టాలని ప్రయత్నం చేశాను కానీ వాళ్లే నన్ను చెడగొట్టారు అంటూ మరొక ట్వీట్ వేశారు. ఇలా చేసినటువంటి ట్వీట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
Super thrilled to receive my B tech degree today 37 years after I passed , which I never took it in 1985 since I wasn’t interested in practicing civil engineering..Thank you #AcharyaNagarjunaUniversity ????????????Mmmmmmuuaahh ???????????? pic.twitter.com/qcmkZ9cWWb
— Ram Gopal Varma (@RGVzoomin) March 15, 2023































