75 వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా దేశ ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు రాష్ట్రపతి. స్వాతంత్ర సమరయోధులను స్మరించుకోవాలని అన్నారు రాష్ట్రపతి.దేశ ప్రజాస్వామ్యానికి పార్లమెంట్ దేవాలయం వంటిదని పేర్కొన్నారు.

కాగా దేశంలో కోవిడ్ సమస్య సమసిపోలేదని అన్నారు రామ్ నాథ్ కోవింద్. దేశ వ్యాప్తంగా 50 కోట్ల పైగా డోసులు పంపిణీ చేశామని స్పష్టం చేశారు. కరోనా ప్రభావం వ్యాపారులు, వలసదారులపై పడిందని చెప్పారు. లాక్‌డౌన్ వల్ల ప్రభావితమైన రంగాల ఊతానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు.































