Ramya Krishna: విజయ్ దేవరకొండ అనన్య పాండే జంటగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా సినిమా లైగర్. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ ఆగస్టు 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా మొదటి షో తోనే డిజాస్టర్ సొంతం చేసుకోవడంతో పెద్ద ఎత్తున ఈ సినిమా నష్టాలను ఎదుర్కొందని తెలుస్తోంది.

ఇకపోతే ఈ సినిమాలో ప్రముఖ బాక్సర్ మైక్ టైసన్ కీలక పాత్రలో నటించారు. అదేవిధంగా ఈ సినిమాలో విజయ్ దేవరకొండ తల్లి పాత్రలో నటి రమ్యకృష్ణ సందడి చేశారు.ఈ సినిమాలో విజయ్ దేవరకొండ తల్లిగా రమ్యకృష్ణ మాస్ పర్ఫామెన్స్ తో దుమ్ము దులిపారని చెప్పాలి. రమ్యకృష్ణ నటన ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకుంది.

ఇకపోతే ఈ సినిమా ఇటు విజయ్ దేవరకొండ కెరియర్ లోను పూరి జగన్నాథ్ కెరియర్లను భారీ బడ్జెట్ చిత్రమని చెప్పాలి. ఇలా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో నటించడం కోసం రమ్యకృష్ణ భారీగానే రెమ్యూనరేషన్ తీసుకున్నారని తెలుస్తోంది.
Ramya Krishna: హీరోయిన్ కి పోటీగా రెమ్యూనరేషన్…
ఈ సినిమాలో విజయ్ దేవరకొండ తల్లి పాత్రలో నటించడం కోసం రమ్యకృష్ణ ఏకంగా 1.5 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుందని వార్తలు వస్తున్నాయి.ఇలా తల్లి పాత్రలో నటించడం కోసం రమ్యకృష్ణ ఏకంగా హీరోయిన్లతో పోటీగా రెమ్యూనరేషన్ తీసుకోవడం అంటే మామూలు విషయం కాదని చెప్పాలి. ఇక ప్రస్తుతం ఈమె తెలుగులో పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.


































