Rashmika: నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది. ఛలో సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ అమ్మడు ఆ తర్వాత తెలుగు, తమిళ్ భాషలలో స్టార్ హీరోల సరసన నటించి అతి తక్కువ కాలంలోనే సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. ఇక పుష్ప సినిమాతో ఈ అమ్మడు పాన్ ఇండియా హీరోయిన్ గా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.

ఇక ఈ సినిమాతో బాలీవుడ్ లో ఈ అమ్మడికి మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. దీంతో బాలీవుడ్ లో కూడా వరుస అవకాశాలు అందుకుంటోంది. ఇలా నార్త్, సౌత్ ఇండస్ట్రీలలో సినిమాలతో నటిస్తూ బిజీగా ఉంటున్న రష్మిక సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలు షేర్ చేయటమే కాకుండా తన సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.
ఇదిలా తాజాగా ఈ అమ్మడు సరికొత్త రికార్డ్ సొంతం చేసుకుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రష్మిక ఇన్ స్టా గ్రామ్ లో మరో మైలు రాయిని చేరుకుంది. ప్రస్తుతం ఇన్ స్టా గ్రామ్ లో 38 మిలియన్ ఫాలోవర్స్ ని కలిగిన రష్మిక అత్యధిక ఫాలోవర్స్ కలిగిన హీరోయిన్ గా సరికొత్త రికార్డు సొంతం చేస్తుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లుగా కొనసాగుతున్న సమంత తమన్నా కాజల్ అగర్వాల్ వంటి వారిని దాటుకొని అత్యధిక ఫాలోవర్స్ కలిగిన హీరోయిన్గా గుర్తింపు సొంతం చేసుకుంది.

Rashmika: ఇంస్టాగ్రామ్ కొత్త రికార్డు…
ఇంస్టాగ్రామ్ లో సమంతకి 26.4 మిలియన్ ఫాలోవర్స్ ఉండగా.. కాజల్ అగర్వాల్ కి 25.4 మిలియన్ ఫాలోవర్స్, అలాగే తమన్నా కి 20.7 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇక 38 మిలియన్ ఫాలోవర్స్ ని సొంతం చేసుకున్న రష్మిక మొదటి స్థానంలో నిలిచింది. ఇదిలా ఉండగా రష్మిక ప్రస్తుతం తెలుగులో పుష్ప 2 సినిమాతో పాటు మరొక ప్రాజెక్టులో నటిస్తోంది.































