Rashmika: నటి రష్మిక మందన్న పరిచయం అవసరం లేని పేరు కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి హీరోయిన్గా ఇండస్ట్రీలోకి వచ్చినటువంటి ఈమె తెలుగులో కూడా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.తెలుగులో కూడా స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె అతి తక్కువ సమయంలోనే పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్నారు.

ఈ విధంగా పలు సినిమాలలో నటిస్తూ నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రష్మిక గురించి ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రష్మిక ఇండస్ట్రీలోకి కనుక రాకపోయి ఉంటే ఏ పని చేసేవారు అనే విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.రష్మిక చదువుతున్న సమయంలోనే ఇండస్ట్రీలోకి రావాలని కలలు కన్నారట. చదువు పూర్తి అవగానే ఇండస్ట్రీ వైపు అడుగులు వేశారని తెలుస్తుంది.
ఇండస్ట్రీలో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలోనే తనకు హీరోయిన్గా అవకాశాలు వచ్చాయని తెలిపారు. అయితే తాను కనుక ఇండస్ట్రీలోకి రాకపోయి ఉంటే ఏదైనా మంచి జాబ్ చేసుకొని తన కుటుంబాన్ని చాలా చక్కగా చూసుకునే దాన్ని అంటూ ఈమె తెలిపారు. ఈ విధంగా రష్మిక కన్న కలలను సహకారం చేసుకుని ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా రాణించడంతో అభిమానులు ఎంత సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Rashmika: పుష్ప 2 షూటింగ్ పనులలో బిజీ…
ఇక ప్రస్తుతం ఈమె పుష్ప 2 సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. అలాగే బాలీవుడ్ సినిమా షూటింగ్ పనులలో కూడా రష్మిక ఎంతో బిజీగా గడుపుతున్నారు. అయితే ఈమె వెంకీ కుడుముల డైరెక్షన్లో నితిన్హీరోగా ఓ సినిమాలో నటిస్తున్నారని వెల్లడించారు అయితే ఈ సినిమా నుంచి రష్మిక తప్పుకున్నారని తెలుస్తోంది.