ఆ స్టార్ డైరెక్టర్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన రష్మిక..?

0
271

వెండితెరపై అద్భుతమైన అవకాశాలను దక్కించుకుంటూ అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా కొనసాగిన వారిలో రష్మిక ఒకరు.ప్రస్తుతం కోలీవుడ్ టాలీవుడ్ చిత్రాలతోపాటు బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మకు వరుసగా చిత్రాల్లో నటించే అవకాశాలను కొల్లగొట్టుకుంటుంది.తాజాగా సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా తరహాలో తెరకెక్కుతున్న పుష్ప సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక నటిస్తున్నారు. అదే విధంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఓ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..

ప్రస్తుతం మెగా హీరో రామ్ చరణ్ తేజ్ రాజమౌళి ఈ సినిమాతో ఎంతో బిజీగా ఉన్నారు. అదేవిధంగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ రెండు పూర్తి కాగానే తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాలి చెర్రీ సరసన నటించడానికి చిత్ర బృందం రష్మికను సంప్రదించినట్టు తెలుస్తోంది.

శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారని అందులో ఒకరి పాత్రలో నటించడానికి చిత్రబృందం రష్మికను సంప్రదించినట్లు తెలుస్తోంది. మరొక హీరోయిన్ ఉప్పెన బ్యూటీ కృతి శెట్టిని తీసుకోవాలనే ఆలోచనలో చిత్రబృందం ఉన్నారని ఇండస్ట్రీ సమాచారం.అయితే ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉంది అనే విషయం తెలియాలంటే చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.