రష్మిక మందాన్న ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇండస్ట్రీలోకి వచ్చిన కొంత సమయం లోనే స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగిన వారిలో ఒకరు. తన నటన ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ అభిమానులను సందడి చేస్తుంటారు.ఈ క్రమంలోనే తనకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటారు.

సాధారణంగా హీరోయిన్ల లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుందో మనకు తెలిసిందే. ముఖ్యంగా టాటూ అంటే మహా పిచ్చి. ఈ విధంగా టాటూల ద్వారా జీవిత సత్యాలను టాటూల రూపంలో లేదా మరికొందరు వారికి నచ్చిన సింబల్స్ ను టాటూగా వేయించుకుంటారు. ఈ విధంగానే రష్మిక చేతికి కూడా ఓ టాటూ ఉంది. అయితే దాని అర్థం ఏమిటో రష్మిక క్లుప్తంగా వివరించారు.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రష్మిక తాజాగా ఇన్స్టాగ్రామ్ ద్వారా లైవ్ లోకి వచ్చి అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఎంతో సరదాగా సమాధానాలు చెప్పారు.ఈ క్రమంలోనే ఓ అభిమాని రష్మిక చేతికి ఉన్న టాటూ అర్థం ఏంటని అడగగా అందుకు రష్మిక ఎంతో వివరంగా ఆమె చేతికి ఉన్న టాటూ అర్థం వివరించారు.
” నీలాంటి వాళ్లు ఒకరే ఉంటారు. నిన్ను ఎవరు రీ ప్లేస్ చేయలేరు.. నీకు నువ్వే ఉండాలి.. నీకు నువ్వే మిగిలిపోతావ్..ఇర్రిప్లేసబుల్ అని అంటూ టాటూ అర్థం వివరించారు.ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఆమె అల్లు అర్జున్ సరసన సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా ఆగస్టు 13న విడుదల కానున్నట్లు చిత్ర బృందం ప్రకటించారు.



























