Rashmika: రష్మిక మందన్న ప్రస్తుతం ఇండస్ట్రీలో చాలా దూకుడు కనబరుస్తున్నారు. భాషతో సంబంధం లేకుండా అన్ని భాషా సినిమా అవకాశాలను అందుకుని ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారని చెప్పాలి.ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో క్షణం తీరిక లేకుండా ఎంతో బిజీగా ఉన్నటువంటి రష్మిక మరోసారి భారీ ఆఫర్ కొట్టేసినట్టు తెలుస్తుంది.

రష్మిక మందన్న ఇప్పటికే బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్న విషయం మనకు తెలిసిందే. అయితే తాజాగా బాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన రౌడీ రాథోడ్ సినిమా సీక్వెల్ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ సినిమాలో నటించే అవకాశాన్ని రష్మిక దక్కించుకున్నారని తెలుస్తుంది.
తెలుగులో రాజమౌళి దర్శకత్వంలో రవితేజ ద్విపాత్రాభినయంలో నటించిన విక్రమార్కుడు సినిమా ఎలాంటి సంచలనాలను సృష్టించిందో మనకు తెలిసిందే. ఈ సినిమాని హిందీలో రౌడీ రాథోడ్ పేరిట అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ఈ సినిమా అప్పట్లో బాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసింది. ఇక తెలుగులో విక్రమార్కుడు సినిమాకు సీక్వెల్ రాకపోయినా హిందీలో మాత్రం ఈ సినిమాకు సీక్వెల్ చిత్రం చేయాలని భావించారు. దీంతో ఈ సినిమా పనులు శరవేగంగా జరుగుతున్నాయని సమాచారం.

Rashmika: షాహిద్ కు జోడిగా రష్మిక…
ఈ సినిమా సీక్వెల్ చిత్రంలో షాహిద్ కపూర్ హీరోగా నటించిన రష్మిక హీరోయిన్ గా నటించే అవకాశాన్ని అందుకున్నారట. ఇక ఈ చిత్రానికి ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్నారని తెలుస్తుంది.ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుందని వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి అంటూ ఈ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో రష్మిక అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.