Rashmika: ఆనంద్ దేవరకొండ వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లుగా సాయి రాజేష్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం బేబీ.ఈ సినిమా విడుదలకు ముందు భారీ అంచనాలను పెంచుకొని ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ప్రేక్షకుల అంచనాలను చేరుకున్నటువంటి ఈ సినిమా భారీ స్థాయిలో కలెక్షన్లను రాబడుతూ దూసుకుపోతుంది.

ఈ సినిమా ప్రీమియర్ షో ద్వారానే మంచి టాక్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం థియేటర్లలో విడుదలైనటువంటి ఈ సినిమాకు మంచి ఆదరణ లభిస్తుంది. దీంతో మౌత్ టాక్ ద్వారానే ప్రేక్షకులు కూడా థియేటర్లకు క్యూ కడుతున్నారు. అయితే అభిమానులతో పాటు నటి రష్మిక మందన్న కూడా ఈ సినిమా చూడటం కోసం థియేటర్ కి వచ్చారనీ తెలుస్తుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటో వైరల్ అవుతుంది.
నటి రష్మిక మందన్న తనని ఎవరు గుర్తుపట్టకుండా ప్యాంట్ టీ షర్ట్ ధరించి మొహానికి మాస్ తలకు బ్లాక్ కలర్ క్యాప్ పెట్టుకొని సినిమా మొదలైన తర్వాత బ్యాక్ డోర్ నుంచి థియేటర్లోకి వెళ్లి ప్రేక్షకుల సమక్షంలో సినిమా చూశారని తెలుస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో మరోసారి నేటిజన్స్ విజయ్ దేవరకొండతో ఈమె డేటింగ్ లో ఉన్నారంటూ కామెంట్ చేస్తున్నారు.

Rashmika: తెరపైకి డేటింగ్ రూమర్స్…
ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు నటించిన సినిమాలు ఇలా మంచి సక్సెస్ అందుకున్నాయి. అయితే ఏ సినిమాని చూడటానికి రష్మిక ఇలా వెళ్లలేదు అయితే ఆనంద్ దేవరకొండ నటించిన ఈ సినిమా చూడటం కోసం వెళ్లడంతో ఈమె విజయ్ దేవరకొండతో డేటింగ్ లో ఉన్నారని అందుకే తన కాబోయే మరిది సినిమాని చూడడం కోసం ఇలా వెళ్లారు అంటూ సోషల్ మీడియా వేదికగా రష్మిక వ్యవహారంపై కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ అవుతుంది.