Rashmika: కిరిక్ పార్టీ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటి రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇలా బాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె తరచూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నేటిజన్ల ట్రోలింగ్ కి గురవుతూ ఉంటారు.

ఇలా ఎన్నోసార్లు సోషల్ మీడియా ట్రోలింగ్ కు గురవుతూ ఉన్నటువంటి రష్మిక తాజాగా మరోసారి నేటిజన్ల ట్రోలింగ్ కు గురయ్యారు.అయితే ఈమె వేసుకున్న డ్రెస్ కారణంగా మరోసారి నేటిజన్లో ఆగ్రహానికి గురయ్యారు. తాజాగా జీ సినీ అవార్డ్స్ కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున సినీ తారలు సందడి చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా నటి రష్మిక పాల్గొన్నారు అయితే ఈమె డ్రెస్ చాలా చిన్నదిగా ఉండడమే కారణమని చెప్పాలి.
ఇలా పూర్తిగా ఎక్స్పోజ్ చేస్తూ పొట్టి దుస్తులు ధరించిడమే కాకుండా ఈ డ్రెస్సులో ఈమె చాలా అసౌకర్యంగా ఫీల్ అయ్యారు.దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది ఈ వీడియో పై స్పందిస్తూ అసలు ఇలాంటి దుస్తులు వేసుకోవడం అవసరమా అంటూ కొందరు కామెంట్లు చేయగా మరి కొందరు మాత్రం నువ్వు కూడా ఉర్ఫీనీ ఫాలో అవుతున్నావా రష్మిక అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Rashmika: ఇలాంటి డ్రెస్ అవసరమా…
ఏది ఏమైనా తాను ధరించిన దుస్తుల కారణంగా మరోసారి ఈమె నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యారు. రష్మిక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఈమె పుష్ప2 సినిమా షూటింగ్ తో ఎంతో బిజీగా ఉన్నారు. అదే విధంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో రణబీర్ కపూర్ హీరోగా నటిస్తున్న యానిమల్ సినిమాలో కూడా బిజీగా ఉన్నారు.


































