Rashmika: కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి ఇండస్ట్రీకి పరిచయమైనటువంటి హీరోయిన్ రష్మిక మందన్న గురించి పరిచయం అవసరం లేదు. కిరిక్ పార్టీ సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైన ఈమె అనంతరం ఇతర భాషలలో కూడా సినిమా అవకాశాలను అందుకొని ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు.

ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా వరుస భాష చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నటువంటి రష్మిక నేడు తన పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఈమె తన సినీ కెరియర్ గురించి చేసినటువంటి కొన్ని కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా తనకు మొదటి సినిమా అవకాశం ఎలా వచ్చింది అనే విషయాల గురించి తెలియజేశారు.
గతంలో తనకు మొదటి సినిమా ఎలా వచ్చిందనే విషయం గురించి మాట్లాడుతూ ఓ అందాల పోటీలలో తాను గెలవడంతో తన ఫోటో పేపర్లో వేశారని ఆ ఫోటో చూసి తనకు సినిమా అవకాశం ఇచ్చారని చెప్పారు. అయితే తాజాగా మరోసారి ఈ విషయం గురించి రష్మిక మాట్లాడుతూ… నా ఫోటో చూసి దర్శక నిర్మాతలు తనకు ఫోన్ చేశారని అయితే అది ఫ్రాంక్ కాల్ అనుకొని తాను నాకు సినిమాలపై ఎలాంటి ఆసక్తి లేదు ఫోన్ పెట్టేయండని చెప్పి ఆ నెంబర్ బ్లాక్ చేశానని తెలిపారు.

Rashmika:స్కూల్ టీచర్ల ద్వారా కలిశారు…
ఈ విధంగా తాను నెంబర్ బ్లాక్ చేయడంతో దర్శక నిర్మాతలు తన స్నేహితులను కలిసే ప్రయత్నాలు చేసిన ఫలించలేదు. చివరికి మా స్కూల్ టీచర్ల ద్వారా తనని కలిసారని ఈ సందర్భంగా రష్మిక తెలియజేశారు. అయితే నాకు నటించడం రాదని చెప్పడంతో వాళ్లు తన చేత కొన్ని డైలాగ్స్ చెప్పించి రికార్డ్ చేసుకుని వెళ్లారని తిరిగి తనకు సినిమా అవకాశం ఇచ్చినట్లు ఈ సందర్భంగా రష్మిక తన మొదటి సినిమా అవకాశం ఎలా వచ్చింది అనే విషయం గురించి చెబుతూ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Team #PushpaTheRule wishes the gorgeous ‘Srivalli’ aka @iamRashmika a very Happy Birthday ❤️
May you continue to RULE our hearts ❤️????
Icon Star @alluarjun @aryasukku #FahadhFaasil @ThisIsDSP @SukumarWritings @PushpaMovie pic.twitter.com/wNbsDxOUys
— Mythri Movie Makers (@MythriOfficial) April 5, 2023































