Raviteja: సాధారణంగా ఒక సినిమా చేసే సమయంలో ఎంతోమంది కష్టపడాల్సి ఉంటుంది అయితే కొన్నిసార్లు ఏదైనా చిరాకు ఉన్నప్పుడు లేదా షూటింగ్ సమయంలో కొన్నిసార్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇతరులపై చిరాకు పడటం చేస్తుంటారు.ఇలా సినిమా షూటింగ్ పూర్తయ్యే లోపు ఎవరితో ఒకరితో చిన్న క్లాసెస్ రావడం సర్వసాధారణం.

ముఖ్యంగా హీరో హీరోయిన్లకు, హీరో దర్శకులకు మధ్య కూడా ఈ విధమైనటువంటి విభేదాలు వస్తుంటాయి. అయితే ఇప్పటికే ఎంతోమంది హీరో హీరోయిన్లు ఈ విధంగా గొడవపడగా దర్శక నిర్మాతలు వారికి సర్దిచెప్పి సినిమా షూటింగ్లను పూర్తి చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే మాస్ మహారాజా రవితేజ సైతం నటి మీరా జాస్మిన్ తో కలిసి చిన్నపాటి గొడవ పడ్డారని అయితే ఆ గొడవ కారణంగా ఇప్పటికీ ఆమె రవితేజ పట్ల చాలా కోపంగా ఉన్నారని తెలుస్తోంది.
మీరాజాస్మిన్ రవితేజ ఇద్దరు కలిసి నటించిన బ్లాక్ బస్టర్ మూవీ భద్ర సినిమా గురించి తెలిసిందే. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమా షూటింగ్ జరిగే సమయంలో మీరాజాస్మిన్ రవితేజ మధ్య చిన్నపాటి గొడవ జరిగింది.ఈ గొడవ కారణంగానే సినిమా షూటింగ్ కూడా కాస్త ఆలస్యమైందని అయితే దర్శక నిర్మాతలు ఈ విషయంపై జోక్యం చేసుకొని ఇద్దరికీ సర్ది చెప్పడంతో సినిమా షూటింగ్ పూర్తి అయినట్లు తెలిపారు.

Raviteja: క్లారిటీ ఇచ్చిన బాలకృష్ణ…
ఇకపోతే రవితేజతో భద్ర సినిమా చేస్తున్న సమయంలోనే మీరాజాస్మిన్ బాలకృష్ణతో కలిసి మహారధి సినిమాలో కూడా నటిస్తున్నారు. అయితే ఆ సమయంలో రవితేజ మీరాజా పడటంతో బయట మాత్రం రవితేజకు బాలకృష్ణకు మధ్య మనస్పర్ధలు వచ్చాయంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఈ వార్తలు ఇండస్ట్రీలో చెక్కర్లు కొడుతూ ఉండడంతో తాజాగా బాలకృష్ణ అన్ స్టాపబుల్ కార్యక్రమానికి రవితేజను ఆహ్వానించి ఈ వార్తల గురించి ప్రస్తావిస్తూ పూర్తిగా చెక్ పెట్టారు.































