భోజనంతో పచ్చి ఉల్లిపాయ తింటే ఏం జరుగుతుందో తెలుసా?

0
150

సాధారణంగా ఉల్లిపాయలేనిదే ఏ వంట పూర్తి కాదు. వంటలలో ఉల్లిపాయలు పాత్ర ఎంతో ఉంది.ఉల్లిపాయలు వేయటం వల్ల వంటకు రుచి మాత్రమే కాకుండా మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.ఉల్లిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉండటం వల్లే ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అనే సామెతను చెప్పారు.అయితే ప్రస్తుత కాలంలో చాలా మంది పిల్లలు వారి భోజనంలో ఉల్లిపాయ ముక్కలు కనిపించిన తీసి వాటిని పడేస్తుంటారు. ఉల్లిపాయలను తినడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఇకపై ఎవరూ కూడా ఉల్లిపాయలను వదలరు.

పూర్వకాలంలో మన పెద్దవారు చద్ది అన్నంలోకి ఉల్లిపాయ పచ్చిమిర్చి పెరుగు కలుపుకుని తినేవారు. అందుకే వారు ఎంతో బలంగా ఉండేవారు.ముఖ్యంగా ఉల్లిపాయలను కూరలు కన్నా అన్నంలోకి పచ్చిగా తీసుకోవడం ద్వారానే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని లైఫ్‌స్టైల్ కోచ్ ల్యూక్ కౌటిన్హో తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వివరించారు. మరి ఉల్లిగడ్డలను పచ్చిగా తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…

ఉల్లిపాయలో అధికంగా ఉండే క్వెర్సెటిన్ అనే పదార్థం మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి క్వెర్సెటిన్ కీలక పాత్ర పోషిస్తుంది.కెర్సెటిన్ మన శరీరంలో కలిగిన మంటను, అధిక రక్తపోటును, అలర్జీ వంటి లక్షణాలను తగ్గించడానికి పూర్తిగా సహాయపడుతుంది. అదేవిధంగా ఉల్లిపాయలలో ఎక్కువ భాగం విటమిన్ సి, బి, పొటాషియం కూడా ఉంటాయి. రక్తపోటు సమస్యతో బాధపడుతున్నవారికి పొటాషియం చాలా మంచిది. ఉల్లిపాయలలో అధిక యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉన్నాయి.

చాలా మంది ఎక్కువగా ఎసిడిటి సమస్యను, ఆమ్లత్వం లేదా GERDవంటి సమస్యలతో బాధపడే వారు ఎలాంటి పరిస్థితులలో కూడా పచ్చి ఉల్లిపాయ ముక్కలను తినకూడదనీ కౌటిన్హో పేర్కొన్నారు. ఉల్లిలో పీచు పదార్థాలు అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియ సమస్యలు కూడా ఉండవు. అదేవిధంగా మూత్రాశయ ఇన్ఫెక్షన్ ను తగ్గించడానికి,ప్రొస్టేట్ గ్రంథినీ ఆరోగ్యంగా ఉంచడానికి ఉల్లిపాయలు ఎంతగానో దోహదపడతాయని ఈ సందర్భంగా కౌటిన్హో తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here