ప్రస్తుతం కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రజలు ఎంతో భయాందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే రోజుకు లక్షల సంఖ్యలో కేసులు నమోదు కాగా, వేల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. ఇటువంటి సమయంలోనే కరోన మహమ్మారిని కట్టడి చేయడం కోసం కొన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ ప్రకటించాయి. ఈ విపత్కర పరిస్థితులలో కరోనా బాధితుల కోసం ఆస్పత్రిలో అన్ని మౌలిక సదుపాయాలతో పాటు ఆక్సిజన్ కొరత లేకుండా ఆక్సిజన్ సిలిండర్ లను కూడా అందుబాటులో ఉండేలా చూసుకుంటున్నాయి.

కరోనా వంటి విపత్కర పరిస్థితులలో దేశీ కేంద్ర బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా నివేదికలో ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది.కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తున్న సమయంలో ప్రజలు బ్యాంకు నుంచి ఎక్కువ మొత్తంలో డబ్బులు విత్ డ్రా చేసుకుంటున్నట్లు తమ నివేదికలో పేర్కొంది. కేవలం 15 రోజుల వ్యవధిలోనే ప్రజలు బ్యాంకు నుంచి అధిక మొత్తంలో డబ్బులు డ్రా చేసుకున్నట్లు తెలిపింది.
ఫిబ్రవరి 27 నుంచి ఏప్రిల్ 9 ఈ మధ్య కాలంలో ప్రజల వద్ద ఉన్న డబ్బులు దాదాపు రూ.52,928 కోట్లు పెరిగాయి.ప్రజలు ఈ విధంగా బ్యాంకులో నుంచి డబ్బులు విత్ డ్రా చేసుకోవడానికి గల కారణం లాక్ డౌన్ ప్రకటించవచ్చు అని సందేహాలు రావడమే. లాక్ డాన్ ప్రకటిస్తే అత్యవసర పరిస్థితులలో డబ్బులు అవసరం ఏర్పడుతుందేమోనని ముందుగానే ప్రజలు బ్యాంకు నుంచి డబ్బులు విత్ డ్రా చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
గత ఏడాది ఈ విధమైనటువంటి కరోనా పరిస్థితులలో కూడా ప్రజలు అధిక మొత్తంలో బ్యాంక్ నుంచి డబ్బులు విత్ డ్రా చేసుకున్నట్లు ఆర్బిఐ వెల్లడించింది.2020 మార్చి నుంచి జూన్ మధ్య కాలంలో ప్రజల వద్ద ఉన్న కరెన్సీ రూ.22.55 లక్షల కోట్ల నుంచి రూ.25.62 లక్షల కోట్లకు చేరిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ నివేదికలో పేర్కొంది.































