మెగస్టార్ చిరంజీవి ఎంతో మందికి ఆదర్శం. అటు సినీ ఇండస్ట్రీలోనూ.. ఇటు సామాజిక సేవలోనూ ఎంతో మందికి స్పూర్తిని ఇస్తున్నారు చిరంజీవి. అయితే మొదట్లో అతడు నటించిన సినిమా ‘ శివుడు శివుడు శివుడు’ సినిమా గురించి అందరికీ తెలిసిందే. అయితే అందులో కోదండరామిరెడ్డి డెరెక్టర్ గా తెరకెక్కించారు. కానీ నిజానికి ఆ సినిమాను కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించలేదు.

దీనికి గల కారణం ఏంటంటే.. ఆ సినిమా మొదటి షాట్ తీసినప్పుడు కోదండరామిరెడ్డి ఉన్నారు. కానీ అదే సమయంలో అతడు అక్కినేని నాగేశ్వరావుతో తెరకెక్కిస్తున్న సినిమా ‘శ్రీరంగ నీతులు’కు కూడా అతడే దర్శకత్వం వహిస్తున్నారు. శివుడు శివుడు శివుడు సినిమా షూటింగ్ మొదటి రోజు ఊటీలో జరుపుకుంటుంది.
ఈ మూవీని శ్రీ క్రాంతి చిత్ర పతాకంపై క్రాంతికుమార్ నిర్మిస్తున్నారు. అయితే అటు నాగేశ్వరావు.. హైదరాబాద్ కు తొందరగా రమ్మని ఫోన్ చేసి అడిగారట.. ఇటు చూస్తే చిరంజీవి.. అటు చూస్తే ఏఎన్నార్ ఎటు వెళ్లాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు కోదండరామిరెడ్డి. ఆ సమయంలో అతడు ఏఎన్నార్ వేపే వెళ్లాడట. దానికి గల కారణం ఏంటటే.. అతడి డేట్స్ ఎక్కువగా అన్నపూర్ణ స్టూడియోస్ కే ఉన్నాయట.
షెడ్యూల్ మొదటి రోజే ఇలా జరగడంతో చేసేది లేక జనవరి 15 నుంచి క్రాంతి కుమార్ మెగా ఫోన్ పట్టుకోవాల్సి వచ్చింది. అయితే 1993లో విడుదలైన చిరంజీవి సినిమా శివుడు శివుడు శివుడు టైటిల్స్‌లో, పోస్టర్స్‌లో కోదండరామిరెడ్డి పేరునే వేశారు. ఈ సినిమా చివరకు ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.































