బిజీ బిజీగా ‘ప్రభాస్’.. 2025 వరకు అస్సలు ఖాళీ లేదట..??

0
142

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్.. ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా చెలామణి అవుతున్న సంగతి తెలిసిందే..ఇక ఫిల్మ్ ఇండస్ట్రీలో వరుస ప్రాజెక్టులతో బిజీ బిజీగా మారుతున్న హీరోల్లో మన డార్లింగ్ ముందు వరుసలో ఉంటాడు…ప్రస్తుతం టాలీవుడ్లో వరుసగా భారీ బడ్జెట్ సినిమాలను చేసుకుంటూ పోతున్న ప్రభాస్‌.. 2025 వరకు ఫుల్ బిజీగా ఉండనున్నాడు. ఇప్పుడిదే విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

బాహుబలి సినిమాతో ప్రభాస్‌ కు వచ్చిన క్రేజ్‌ కారణంగా అతనితో పరభాషా దర్శకులు, ముఖ్యంగా బాలీవుడ్ డైరెక్టర్స్ సినిమా చేయడానికి అత్యంత ఆసక్తి చూపుతున్నారు. దానికి తోడు ప్రభాస్‌ కూడా తనకు నచ్చిన స్క్రిప్ట్స్ కు ఓకే చెబుతూ వెళుతున్నాడు. దీంతో మరో మూడు, నాలుగేళ్ళ వరకూ ప్రభాస్‌ ఖాళీగా ఉండని పరిస్థితి ఏర్పడింది.ఇక ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా రొమాంటిక్ మూవీ ‘రాధేశ్యామ్’ తుదిమెరుగులు దిద్దుకుంటూ ఉండగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్న ‘సలార్’ సెట్స్ పై ఉంది.

అటు బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ త్రీడీ మూవీ ‘ఆదిపురుష్’ ఇటీవలే మొదలైంది. ఈ రెండు సినిమాల షూటింగ్స్ ఈ ఏడాది చివరికి గానీ పూర్తి అయ్యేలా లేవు.అలాగే వచ్చే ఏడాది అంతా ప్రభాస్ వైజయంతి మూవీస్ బ్యానర్ లో నాగ అశ్విన్ చేయబోతున్న చిత్రానికి డేట్స్ ఇస్తున్నాడని తెలుస్తోంది. ఈ సోషియో ఫాంటసీ సైంటిఫిక్ మూవీకీ భారీ డేట్స్ కేటాయించాల్సి ఉందట. దీనితో పాటే హిందీ ఫిల్మ్ మేకర్ సిద్ధార్థ్ ఆనంద్ తో సినిమా చేయడానికి కూడా ప్రభాస్ అంగీకారం తెలిపాడని బీ టౌన్ లో టాక్‌ వినిపిస్తోంది.

వీటితో పాటు సలార్‌ తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో మరో సినిమాకు… సుధా కొంగర డైరెక్షన్‌లో ఇంకో సినిమాకు ప్రభాస్‌ కమిట్ అయ్యాడని టాలీవుడ్ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్‌ల లిస్ట్ చూస్తుంటే… ప్రభాస్‌ 2025 వరకు మరే డైరెక్టర్ కు అందుబాటులో ఉండడని తెలుస్తోంది. కాగా, ఈ విషయం తెలిసి అభిమానులు మాత్రం ఫుల్ ఖుషీ అవుతున్నారు.. మరి ఈ సినిమాలన్నీ ఎక్కువ గ్యాప్ లేకుండా విడుదలైతే ఇక డార్లింగ్ ఫ్యాన్స్ కి పండగే మరి..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here