బుల్లితెర రియాలిటీ షోలలో ఎన్ని షోలు ఉన్నా బిగ్ బాస్ షో ఇచ్చే మజానే వేరు. సినిమాల్లో, సీరియళ్లలో, యూట్యూబ్ లో నటనతో మెప్పించే నటీనటులు, యాంకర్లు నిజజీవితంలో ఏ విధంగా ఉంటారో, వాళ్ల ఆలోచనా శైలి ఏ విధంగా ఉంటుందో తెలిపే షో కావడంతో బిగ్ బాస్ షోకు ఇంత క్రేజ్ ఉంది. గత సీజన్లలో బిగ్ బాస్ షోలో టీవీ9 యాంకర్లు దీప్తి నల్లమోతు, జాఫర్ పాల్గొనగా ఈ సీజన్ లో దేవీ నాగవల్లి పాల్గొన్నారు.

అయితే దేవీ నాగవల్లి వ్యక్తిగత వివరాలు ఎవరికీ పెద్దగా తెలియవు. ఆమె టీవీ9 యాంకర్ గా మాత్రమే ప్రజలందరికీ సుపరిచితం. ఆమె షోలో చెప్పేంత వరకు ఆమెకు పెళ్లై భర్తకు దూరంగా ఉంటుందనే సంగతి కూడా ఎవరికీ తెలియదు. అయితే తాజాగా దేవీ నాగవల్లి తల్లి ఆమె గురించి కీలక విషయాలను వెల్లడించారు. డబ్బు సంపాదించడం కోసమే బిగ్ బాస్ షోకు వచ్చానని చెబుతున్న దేవీ ఇతర కంటెస్టెంట్లకు గట్టి పోటీనే ఇస్తున్నారు.

స్టైలిష్ గా వార్తలు చదివే దేవి వస్త్రధారణ, వేషధారణ భిన్నంగా ఉంటాయి. యాంకర్ గా సీరియస్ గా కనిపించే దేవీ హౌస్ లోనూ అదే సీరియస్ నెస్ తో గేమ్ ఆడుతోంది. ఆమె విన్నర్ అవుతుందో లేదో చెప్పలేం కానీ బిగ్ బాస్ టైటిల్ కు గట్టి పోటీ మాత్రం ఖచ్చితంగా ఇస్తుందని చెప్పవచ్చు. దేవీ నాగవల్లి తల్లి తన కూతురు విన్నర్ అవుతుందని.. తను ఇంట్లో ఎలా ఉందో హౌస్ లోనూ అదే విధంగా ఉందని చెప్పారు.
తన అత్తయ్య తమ్ముడు దాసరి నారాయణరావు అని దేవికి దాసరి తాత అవుతారని ఆమె చెప్పారు. దేవి ఏ విషయంలోనైనా స్ట్రిక్ట్ గా ఉంటుందని ఆమె అన్నారు. దేవి ఏ విషయంలోనైనా ఫైట్ చేసే విధానం ఎంతో బాగుంటుందని.. ఆమె ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిందని దేవి తల్లి చెప్పుకొచ్చారు.































