ఏపీ పదో తరగతి విద్యార్థులకు శుభవార్త.. ట్రిపుల్ ఐటీ కౌన్సిలింగ్ ఎప్పుడంటే..?

0
112

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం పదో తరగతిలో ప్రతిభ చూపిన విద్యార్థులు ట్రిపుల్ ఐటీలకు ఎంపికవుతారనే సంగతి తెలిసిందే. ప్రతి సంవత్సరం పదో తరగతి మెరిట్ ఆధారంగా ట్రిపుల్ ఐటీలకు విద్యార్థుల ఎంపిక జరిగేది. ఈ ఏడాది కరోనా, లాక్ డౌన్ వల్ల మారిన పరిస్థితుల నేపథ్యంలో ప్రవేశ పరీక్ష నిర్వహించి ఆ పరీక్ష ఫలితాల ఆధారంగా ట్రిపుల్ ఐటీలకు ఎంపిక ప్రక్రియ చేపడుతున్నారు.

రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నోలెడ్జ్ టెక్నాలజీస్ వైస్ ఛాన్స్ లర్ కేసీ రెడ్డి శ్రీకాకుళం, నూజివీడు, ఒంగోలు, ఇడుపులపాయలలోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లలో 2021 సంవత్సరం జనవరి నెల 4వ తేదీ నుంచి అదే నెల 11వ తేదీ వరకు మెరిట్ ర్యాంకుల జాబితా ఆధారంగా కౌన్సిలింగ్ జరుపుతున్నట్టు వెల్లడించారు. కౌన్సిలింగ్ కు హాజరయ్యే విద్యార్థులు ఆర్జీయూకేజీ పరీక్ష మార్కుల మెమో, ర్యాంక్ కార్డ్, పదో తరగతి హాల్ టికెట్, క్యాస్ట్, నేటివిటీ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.

పీహెచ్,ఎన్సీసీ, స్పోర్ట్స్, సీఏపీ అభ్యర్థులు కౌన్సిలింగ్ కు అవసరమైన ధృవపత్రాలను కలిగి ఉండాలి. http://www.rgukt.in/ వెబ్ సైట్ ద్వారా విద్యార్థులు కౌన్సిలింగ్ డేట్, ర్యాంకులు, ఇతర వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. కౌన్సిలింగ్ కు హాజరయ్యే విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు రెండు సెట్లు జిరాక్స్ కాపీలను తీసుకెళ్లాల్సి ఉంటుంది. విద్యార్థులకు సంక్రాంతి సెలవుల అనంతరం జనవరి 18వ తేదీ నుంచి తరగతులు ప్రారంభం అవుతాయి.

ఒక్కో ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లో1,100 సీట్ల చొప్పున రాష్ట్రంలోని నాలుగు ట్రిపుల్ ఐటీల్లో 4,400 సీట్ల భర్తీ జరుగుతోంది. ప్రత్యేక కేటగిరీ అభ్యర్థులకు ఆలస్యంగా కౌన్సిలింగ్ జరగనుందని సమాచారం. ఎంపికైన విద్యార్థులు పీయూసీ + బీటెక్ ఆరు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సును చదువుతారు. ట్రిపుల్ ఐటీలలో చదివే విద్యార్థులకు ఇతర కాలేజీలలో చదివే విద్యార్థులతో పోలిస్తే మెరుగైన విద్యావకాశాలు ఉంటాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here