Jonnavitthula – Ramalingeswararao:తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రముఖ గీత రచయితగా ఎంతో పేరు సంపాదించుకున్న జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఈయన ఎన్నో అద్భుతమైన సినిమాలకు పాటలు అందించి ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఇకపోతే శ్రీరామరాజ్యం సినిమాలో పాటలు రచించిన అందుకుగాను ఈయన ఫిలిం ఫేర్ అవార్డు దక్కించుకున్నారు.

ఇలా ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు సంపాదించుకున్న జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే రాంగోపాల్ వర్మ గురించి ఈ ఇంటర్వ్యూలో ప్రస్తావిస్తూ ఎన్నో విషయాలను తెలిపారు.రామ్ గోపాల్ వర్మ క్యారెక్టర్ ఏంటి అతని నిజ స్వరూపం ఏంటి అనేది ఆయన బయటకు చెప్పుకుంటారు అయితే ఆయన సినిమా తీయాలనే ఆలోచన నీకు ఎందుకు వచ్చింది అనే ప్రశ్న ఎదురవడంతో ఆయన తనదైన శైలిలో ఒక పాట పాడుతూ ఆ సినిమా ఎందుకు తీయాలనుకున్నానో వివరించారు.

ఇక జొన్నవిత్తుల రామలింగేశ్వర రావుకి, ఆర్జివికి మధ్య అమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా సమయంలో మనస్పర్ధలు ఎదురయ్యాయని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఆర్జివి కనుక విజ్ఞాని అని భావిస్తారు. ఆయన చేసిన అదే కరెక్ట్ అనే భావనలో ఆయన ఉంటారు అయితే అతను ఒకప్పుడు విజ్ఞాన అయినప్పటికీ ఇప్పుడు అతను ఒకమానసిక స్థితి కోల్పోయిన వ్యక్తి అంటూ ఈ సందర్భంగా ఈయన వర్మ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.
స్త్రీలు , మాఫియా లేనిదే ఆర్జీవి సినిమా ఉండదు..
రామ్ గోపాల్ వర్మలో అంతా క్రియేటివిటి దాగి ఉంటే ఆ క్రియేటివిటీని బయట పెట్టండి ఎప్పుడు చూడు మానభంగాలు, రేప్ కేసులతో సినిమాలు చేయడం, ఫ్యాక్షనిజం, రౌడీయిజం వంటి సినిమాలు తెరకెక్కిస్తారు. ఇలా అమ్మాయిలు మాఫియాలు లేకుండా ఆర్జివి సినిమా చేయరు. ప్రస్తుతం ఆయన ఇండస్ట్రీకి ఒక జీరో. ఆయన కన్న మొన్న ఉప్పెన సినిమా తీసిన డైరెక్టర్ ఎంతో నయం అతనిలో ఏదో క్రియేటివిటీ దాగి ఉంది ఆ క్రియేటివిటీ ఆధారంగా ఆ సినిమాను తెరకెక్కించి అద్భుతమైన విజయాన్ని సాధించారనీ ఈ సందర్భంగా జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు రామ్ గోపాల్ వర్మ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.
































