ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి తీవ్రంగా వ్యాపిస్తోంది. సామాన్యుల నుంచి మొదలుకొని సినీ సెలెబ్రెటీల దాకా అందరూ ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఇప్పటికే కొన్ని వేల ప్రాణాలను బలి తీసుకుంది ఈ మహమ్మారి.ఈ వైరస్ ని అరికట్టే నేపథ్యంలో నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నంలో ఆనందయ్య ఇస్తున్న ఆయుర్వేద మందు గత నాలుగు రోజులుగా అంతటా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఈ మందు శాస్త్రీయతను నిర్ధారించేందుకు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) టీమ్ సైతం అక్కడికి చేరుకుంది.

ఈ నేపధ్యంలో డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ఆనందయ్య ఆయుర్వేద మందుపై ట్వీట్ల వర్షం కురిపోస్తూనే ఉన్నారు. పైజర్, మోడెర్నా వంటి వ్యాక్సిన్ నిపుణులే తమ ఫార్ములాను ఇప్పటి వరకు ఎవరితోనూ పంచుకోలేదు.. కానీ, ఆనందయ్య మాత్రం తన ఫార్ములాను ఎవరు అడిగితే వారికి ఉచితంగా ఇచ్చేస్తున్నారు. ఆనందయ్యకు ఎట్టిపరిస్థితుల్లోనూ నోబెల్ ప్రైజ్ ఇవ్వాల్సిందే.” అంటూ వర్మ మార్క్ ట్వీట్ల వర్షం మొదలెట్టిన వర్మ. వెంటనే “కరోనా అందరిని చంపేస్తే.. ఆనందయ్య మాత్రం అల్లోపతి మందులను చంపేశారు’ అంటూ ట్వీట్ చేశారు వర్మ. వెంటనే మరో ట్వీట్ చేస్తూ ‘ఆనందయ్య కరోనా మందును అందరికీ ఇస్తే చాలని.. ఇక జనాలకు వ్యాక్సిన్ వేయాల్సిన అవసరం లేదని సెటైర్ వేసారు వర్మ.
ఇక కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టిన ఫైజర్, భారత్ బయోటెక్, సీరం, అమెరికన్ డాక్టర్ ఫౌచీలను ట్యాగ్ చేసి వర్మ ఎండగట్టారు. ఆనందయ్య వనమూలికలతో తయారు చేసిన కరోనా మందును ఉచితంగా అందరికీ పంపిణీ చేస్తుంటే మీరేమో వందల కోట్లతో వ్యాక్సిన్లు తయారు చేసి భారీ రేట్లకు అమ్ముతారా? అంటూ ఎద్దేవ చేశారు వర్మ. ఆ రాష్ట్రంలో అపోలో హాస్పిటల్స్, ఏయిమ్స్, కేర్ సహా అన్ని ఆసుపత్రులను ‘ఆనందయ్య ఆస్పత్రులుగా’ మార్చాలంటూ.. మెడికల్ కాలేజీలు అనీ తమ సెలబస్ లో ఆనందయ్య రెసిపీ గురించి తప్పకుండా చెప్పాలని వర్మ డిమాండ్ చేసారు.. ఇలా వర్మ ఈరోజు వరుసగా ఆనందయ్య గొప్పతనంపై వర్ణిస్తూ.. కరోనా విషయంలో ఫెయిల్ అయిన వారిని ట్యాగ్ చేస్తూ వరుస ట్వీట్స్ చేసాడు వర్మ. ప్రస్తుతం వర్మ చేసిన ఈ ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి…!!































