RGV: ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ అరెస్టు విషయం గురించి తరచూ ఏదో ఒక వార్త వెలుగులోకి వస్తుంది. అయితే ఈయన అరెస్టుకు భయపడి పరారీలో ఉన్నారు అంటూ కూడా వార్తలు వస్తున్నాయి. ఇక ఈయన ఇంటి ముందు పోలీసులు కూడా పడిగాపులు కాస్తున్నారు. ఇలా వర్మ అరెస్టు విషయంలో ఏపీలో ఎంత ఉత్కంఠత నెలకొంది.

అరెస్టుకు భయపడి వర్మ పారిపోయారు అంటూ వార్తలు వస్తున్న తరుణంలో ఈయన ఒక వీడియోని సోషల్ మీడియా వేదికగా విడుదల చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ..తాను ఎవర్నో.. ఏదో అంటే.. వాళ్లకు మనోభావాలు దెబ్బతినడం ఏంటంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఏడాది క్రితం పెట్టిన పోస్టులకు ఇప్పుడు మనోభావాలు దెబ్బతిన్నాయా అంటూ ఈయన ప్రశ్నించారు.
పోలీసులు తనపై పెట్టిన సెక్షన్లో తనకు ఎలా వర్తిస్తాయని ఈయన ప్రశ్నించారు.పోలీసులను రాజకీయ నేతలు అస్త్రాలుగా మార్చుకున్నారని ఆరోపించారు. మర్డర్ కేసులను కూడా ఏళ్లతరబడి పట్టించుకోరు.. వీటికి అంత ఎమర్జెన్సీ ఏమొచ్చిందంటున్నారు. ఇక తాను భయపడి పారిపోయానని చెబుతున్నారు. నేను పరారీలో లేను షూటింగ్ పనులలో బిజీగా ఉన్నాను షూటింగ్ ఆలస్యమైతే నిర్మాతకు నష్టాలు వస్తాయి అందుకే పోలీసులకు సమయం కావాలని కోరానని తెలిపారు.

RGV: నేను పారిపోలేదు…
ఇక తనపై కేసు నమోదు కావడంతో ఈయన ఆ కేసు కొట్టి వేయాలని కోర్టును ఆశ్రయించగా కోర్టు మాత్రం తిరస్కరించింది. ఈ క్రమంలోనే ఈయన ముందస్తు బెయిల్ కి అప్లై చేశారు. ఇక ఈయన బెయిల్ పిటిషన్ విచారణ నేడు జరగనుంది. ఇక ఈయన కోసం పోలీసులు ముమ్మరంగ గాలింపు చర్యలు చేపడుతున్న సంగతి తెలిసిందే.




























