Rithu Chowdary: సిగ్గు లేదా అంటూ జబర్దస్త్ నటి రీతు చౌదరి పై నెటిజన్స్ ట్రోలింగ్… అసలేం జరిగిందంటే?

0
191

Rithu Chowdary: జబర్దస్త్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటి రీతు చౌదరి ఒకరు. ఇదివరకే ఈమె బుల్లితెర కార్యక్రమాలు పలు సీరియల్స్ లో నటించిన రానీ గుర్తింపు జబర్దస్త్ కార్యక్రమం ద్వారా వచ్చిందని చెప్పాలి. ఇలా జబర్దస్త్ ద్వారా ఎంతో ఫేమస్ అయినటువంటి ఈమె సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు.

ఇలా సోషల్ మీడియాలో తరచూ తన గ్లామరస్ ఫోటోలను షేర్ చేయడమే కాకుండా ఎన్నో రీల్స్ చేస్తూ పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా అభిమానులను సంపాదించుకున్నారు. అయితే గత వారం రోజుల క్రితం
రీతు చౌదరి తండ్రి గుండెపోటుతో మరణించారు. అయితే ఈ విషయాన్ని ఈమె సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ ఎంతో ఎమోషనల్ అయ్యారు.

నాన్న నన్ను వదిలి ఎలా వెళ్ళిపోయావు నువ్వు లేకుండా నేను ఉండలేను ఈ కూతురి కోసం తిరిగి రా ప్లీజ్ అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఇది చూసినటువంటి ఎంతోమంది నెటిజన్స్ ఆమెను ఓదార్చరు. అయితే తన తండ్రి మరణించి వారం రోజులు కూడా గడపకు ముందే
రీతు చౌదరి సోషల్ మీడియా వేదికగా తన గ్లామరస్ ఫోటోలను షేర్ చేశారు. బ్లాక్ సారీ కట్టుకొని ఉన్నటువంటి ఈమె ఇందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ ‘కన్నె కస్తూరినంత నేనై.. వన్నె ముస్తాబు చేసుకోన.. చెలై నీకు కాశ్మీరాల చలే పంచనా’ అంటూ రామయ్య వస్తావయ్య సినిమాలోని పాట లిరిక్స్ జోడించారు.

Rithu Chowdary: 11 రోజుల కర్మ అయ్యేవరకు వేచి ఉండలేకపోయావా…

ఇలా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నేటిజన్స్ ఈమెను ట్రోల్ చేసే పనిలో ఉన్నారు.తండ్రి మరణించి వారం రోజులు కూడా కాకుండానే ఏంటి ఈ పని అప్పుడే మొదలెట్టేసావా అంటూ కొందరు కామెంట్లు చేయడం మరికొందరు సిగ్గు మాలిన దాన మొన్ననే కదా తండ్రి మరణించారని ఎమోషనల్ పోస్ట్ చేశావు 11 రోజుల కర్మ అయ్యేవరకు వేచి ఉండలేకపోయావా అంటూ దారుణంగా రీతు చౌదరిపై ట్రోల్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

 

 

 

A post shared by Rithu_chowdary (@rithu_chowdhary)