Connect with us

Featured

Rithu Chowdary: ప్రియుడితో బ్రేకప్ చెప్పుకున్న రీతు చౌదరి… ఒక ఫోటో క్లారిటీ ఇచ్చేసిందిగా?

Published

on

Rithu Chowdary: రీతు చౌదరి పరిచయం అవసరం లేని పేరు బుల్లితెర సీరియల్స్ లో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె అనంతరం యూట్యూబ్ వీడియోస్ షార్ట్ ఫిలిమ్స్ అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో సందడి చేశారు. ఇలా సోషల్ మీడియా వేదికగా తరచూ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను సొంతం చేసుకున్న ఈమె జబర్దస్త్ కార్యక్రమంలో కూడా సందడి చేశారు.

Advertisement

ఇకపోతే రీతూ చౌదరి గతంలో శ్రీకాంత్ అనే వ్యక్తిని తాను ప్రేమిస్తున్నానని త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నాను అంటూ తెలియజేశారు. శ్రీకాంత్ పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీకి చెందిన వ్యక్తి అని తెలిపారు. అయితే గత కొంతకాలంగా రీతు చౌదరి తన ప్రియుడు గురించి ఎక్కడ ప్రస్తావనకు తీసుకురాలేదు. దీంతో వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారు అంటూ వార్తలు వచ్చాయి.

ఈ విధంగా రీతు చౌదరి తన ప్రియుడు శ్రీకాంత్ బ్రేకప్ చెప్పుకున్నారంటూ వార్తలు వస్తున్నటువంటి తరుణంలో ఈ వార్తలపై స్పందిస్తూ ఈ వార్తలకు పులిస్టాప్ పెట్టేసారు. ఇలా ప్రియుడుతో బ్రేకప్ చెప్పుకున్నారంటూ వార్తలు వస్తున్నటువంటి తరుణంలో ఈమె సోషల్ మీడియా వేదికగా తన ప్రియుడితో కలిసి ఉన్న ఫోటోని షేర్ చేశారు.

Rithu Chowdary: ప్రియుడితో ఉన్న ఫోటో షేర్ చేసిన రీతూ


ఇలా శ్రీకాంత్ రీతూ చౌదరి కలిసి దిగిన ఫోటోని ఈమె షేర్ చేయడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అయితే ఈ ఫోటో చూసిన వారందరూ వీరిద్దరూ ఎలాంటి బ్రేకప్ చెప్పుకోలేదని కలిసి సంతోషంగా ఉన్నారని వీరి గురించి వస్తున్నటువంటి వార్తలు పూర్తిగా ఆ వాస్తవమని భావించారు.ప్రస్తుతం ఈ ఒక్క ఫోటోతో రీతు చౌదరి తన గురించి వస్తున్నటువంటి వార్తలకు చెక్ పెట్టారు.

Advertisement

Featured

Nidhhi Agerwal: రాజాసాబ్ నుంచి అలాంటి ఫోటో షేర్ చేసిన నిధి అగర్వాల్.. ఫోటో వైరల్!

Published

on

Nidhhi Agerwal: టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ నాలుగైదు పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే. వరుస సినిమాలతో క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతున్నారు ప్రభాస్. అందులో భాగంగానే ప్రభాస్ నటిస్తున్న సినిమాలలో రాజా సాబ్ సినిమా కూడా ఒకటి. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ వివేక కూచిబబొట్ల నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో నిధి అగర్వాల్ మాళవిక మోహనన్, రిధి లు హీరోయిన్ లుగా నటిస్తున్నారు.

Advertisement

బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. హారర్, రొమాంటిక్, కామెడీ క‌థాంశంతో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ప్ర‌స్తుతం ఈ చిత్ర షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. 2025 ఏప్రిల్ 10న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ డేట్ ని కూడా ఫిక్స్ చేసేసారు మూవీ మేకర్స్. ఇది ఇలా ఉంటే నేడు అనగా అక్టోబర్ 8వ తేదీన దర్శకుడు మారుతి పుట్టినరోజు సందర్భంగా హీరోయిన్ నిధి అగర్వాల్ దర్శకుడు తో కలిసి ఉన్న ఫోటోని షేర్ చేస్తూ ఆయనకు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది.

జీవితం ఆనందమయం కావాలి..

ఈ మేరకు తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఈ విధంగా రాసుకొచ్చింది. ప్రియమైన దర్శకుడు మారుతికి పుట్టిన రోజు శుభాకాంక్షలు స‌ర్‌. సినిమా పట్ల మీ అభిరుచి, ప్రేమను ప్రపంచం త్వరలో చూడబోతోంది. మీకు అంతా మంచే జ‌ర‌గాల‌ని, మీ జీవితం ఆనంద మ‌యం కావాల‌ని కోరుకుంటున్నాను అని నిధి అగ‌ర్వాల్ ట్వీట్ చేసింది. నిధి అగర్వాల్ షేర్ చేసిన ఆ ఫోటోని బట్టి చూస్తే అది రాజా సాబ్ షూటింగ్లో దిగిన పిక్ అని తెలుస్తోంది.. ప్రస్తుతం అందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో డార్లింగ్ ఫ్యాన్స్ తో పాటు నెటిజన్స్ కూడా దర్శకుడు మారుతికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Advertisement

https://x.com/AgerwalNidhhi/status/1843514483983167593?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1843514483983167593%7Ctwgr%5Efa43dc5e69ef6fb12eecb17fbb90e969578516b6%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2F10tv.in%2Ftelugu-news%2Fmovies%2Fnidhhi-agerwal-shares-working-still-from-the-raja-saab-movie-873388.html

Advertisement
Continue Reading

Featured

Tollywood: చిరు రిజెక్ట్ చేసిన సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన నటుడు.. ఎవరో తెలుసా?

Published

on

Tollywood: మామూలుగా సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో రిజెక్ట్ చేసిన సినిమాను మరొక హీరో హీరోయిన్ చేయడం అన్నది సాధారణం. అలా ఒక హీరో హీరోయిన్ రిజెక్ట్ చేసిన సినిమాలను మరొక హీరో హీరోయిన్లు చేసి ఆ సినిమాతో మంచి సక్సెస్ను అందుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. అలా ఇప్పటికే ఎన్నో సినిమాలు సినిమా ఇండస్ట్రీలో మంచి సక్సెస్ గా సాధించిన విషయం తెలిసిందే. ఆ విధంగా చిరంజీవి రిజెక్ట్ చేసిన ఒక సినిమాతో బ్లాక్ బస్టర్ హీట్ ను అందుకొని విలన్ నుంచి హీరోగా మారాడట ఒక నటుడు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు? ఆ సినిమా ఏది? అన్న వివరాల్లోకి వెళితే.. ఆ నటుడు ఎవరో కాదు మోహన్ బాబు.

Advertisement

చిరంజీవి రిజెక్ట్ చేసిన సబ్జెక్టు తో బ్లాక్ బస్టర్ కొట్టాడు మోహన్ బాబు. ఆ మూవీతో విలన్ నుండి హీరోగా టర్న్ అయ్యాడు. మోహన్ బాబు కెరీర్ విలన్ గా మొదలైంది. బిగినింగ్ లో ఆయన కరుడుగట్టిన విలన్ రోల్స్ చేశాడు. అప్పుడప్పుడు ప్రాధాన్యత ఉన్న పాజిటివ్ రోల్స్ తో పాటు సెకండ్ హీరోగా కూడా ఆయన నటించాడు. 90ల నాటికి హీరో కావాలనే ప్రయత్నాలు చేశాడు.
దర్శకుడు కే రాఘవేంద్రరావు తెరకెక్కించిన అల్లుడు గారు మూవీలో మోహన్ బాబు హీరోగా చేశాడు. అలాగే రౌడీ మొగుడు టైటిల్ తో మరొక చిత్రంలో హీరోగా నటించాడు. లీడ్ రోల్స్ చేస్తున్నప్పటికీ, ప్రతినాయకుడు పాత్రలు చేయడం ఆపలేదు. 1991లో మోహన్ బాబుకు సోలో హీరోగా బ్లాక్ బస్టర్ పడింది.

అదే అసెంబ్లీ రౌడీ. ఈ చిత్రానికి బి. గోపాల్ దర్శకుడు కాగా ఆయన మొదట చిరంజీవితో ఈ మూవీ చేయాలని అనుకున్నారట. చిరంజీవికి కథ నచ్చినప్పటికీ బిజీ షెడ్యూల్స్ కారణంగా ఇప్పుడు చేయడం కుదరదు. సమయం పడుతుంది అన్నారట. దాంతో బి.గోపాల్ ఈ కథను మోహన్ బాబు దగ్గరకు తీసుకుపోయాడు. మోహన్ బాబు ఓకే చేయడంతో మూవీ పట్టాలెక్కింది. అప్పట్లో టాలీవుడ్, బాలీవుడ్ ని షేక్ చేస్తున్న దివ్యభారతిని హీరోయిన్ గా తీసుకున్నారు. నిజానికి ఇది స్ట్రెయిట్ మూవీ కాదు. తమిళ హిట్ మూవీ వేలై కీడైచుడుచు చిత్రం ఆధారంగా తెరకెక్కించారు. తమిళంలో సత్యరాజ్ హీరోగా నటించాడు.

డైలాగ్ కింగ్ గా అవతారం..

Advertisement

మోహన్ బాబు ఇమేజ్ కి తగ్గట్లు, తెలుగు నేటివిటీకి దగ్గరగా మార్పులు చేసి తెరకెక్కించారు. అసెంబ్లీ రౌడీ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీలో మోహన్ బాబు చెప్పే డైలాగ్స్ బాగా ఫేమస్. డైలాగ్ కింగ్ గా మోహన్ బాబు అవతరించాడు. హీరోగా మోహన్ బాబు కెరీర్ కి అసెంబ్లీ రౌడీ గట్టి పునాది వేసింది. ఆల్రెడీ ఒప్పుకున్న చిత్రాల వరకు విలన్ గా చేసిన మోహన్ బాబు అనంతరం హీరోగా కొనసాగాడు. అల్లరి మొగుడు, చిట్టెమ్మ మొగుడు, మేజర్ చంద్రకాంత్ వంటి హిట్ చిత్రాలతో మోహన్ బాబు హీరోగా సెటిల్ అయ్యాడు. 1995లో వచ్చిన పెదరాయుడు ఇండస్ట్రీ హిట్ కొట్టింది. ఆ విధంగా చిరంజీవి వద్దనుకున్న సినిమాతో సూపర్ హిట్ను అందుకొని విలన్ నుంచి హీరోగా మారాడు మోహన్ బాబు.

Advertisement
Continue Reading

Featured

Sudheer Babu: మహేష్ బాబు గురించి అలాంటి వ్యాఖ్యలు చేసిన సుధీర్ బాబు?

Published

on

Sudheer Babu: టాలీవుడ్ హీరో సుధీర్ బాబు హీరోగా నటించిన తాజా చిత్రం మా నాన్న సూపర్ హీరో. ఈ చిత్రం దసరా పండుగ కానుకగా అక్టోబర్ 11వ తేదీన విడుదల కానున్న విషయం తెలిసిందే. విడుదల తేదీకి మరికొద్ది రోజులే సమయం ఉండడంతో చిత్ర బృందం ప్రమోషన్స్ని వేగవంతం చేసింది. ఈ ప్రమోషన్స్ లో భాగంగానే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సుధీర్ బాబు పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. యాక్షన్‌ జానర్‌ నుంచి పక్కకు వచ్చి ఇలాంటి భావోద్వేగభరితమైన కథతో రావడానికి కారణమేంటి? అని అడగగా సుధీర్ బాబు మాట్లాడుతూ..

Advertisement

ప్రత్యేకంగా ఫలానా కథలతోనే ముందుకెళ్లాలని నేనేమీ అనుకోను. నా వద్దకొచ్చిన కథల్లో ఏది బాగుంటే దానితో ముందుకెళ్తా. అయితే అనుకోకుండా నా నుంచి ఈ మధ్య వరుసగా యాక్షన్‌ చిత్రాలే వచ్చాయి. నిజానికి మా నాన్న సూపర్‌ హీరో మూవీని హరోం హర సినిమాకు ముందే ఒప్పుకున్నాను. కాకపోతే విడుదల కాస్త అటు ఇటైంది. నేను నటుడిగా అన్ని రకాల జానర్‌ లు ప్రయత్నించాలనుకుంటాను. వరుసగా యాక్షన్‌ సినిమాలే చేస్తే ఒక ఇమేజ్‌లో ఇరుక్కుపోవాల్సి వస్తుంది. ఒక దశ దాటాక సరైన కథలు కూడా దొరకవు. అందుకే రకరకాల కథలు చేయాలనుకుంటాను. అప్పుడే దర్శకులకు నేను ఏదైనా చేయగలనన్న నమ్మకం కలుగుతుంది అని తెలిపారు.

నమ్మకం రెట్టింపయ్యింది..

మా నాన్న సూపర్‌ హీరో ట్రైలర్‌ చూసి మహేశ్‌ బాబు ఏమన్నారు? అని ప్రశ్నించగా సుధీర్ బాబు మాట్లాడుతూ.. మహేశ్‌బాబు సాధారణంగా ఏదైనా ఎక్కువ ఎక్స్‌ప్రెస్‌ చేయరు. ఆయనకు నేను తొలుత రఫ్‌ కట్‌ ట్రైలర్‌ పంపిస్తే బాగుందని మెసేజ్‌ పెట్టారు. ఆ తర్వాత ఫైనల్‌ ట్రైలర్‌ పంపాను. అది చూశాక మాత్రం చాలా మెచ్చుకున్నారు. హార్ట్‌ టచ్చింగ్‌ గా ఉందని అన్నారు. ఆఖర్లో వచ్చే మహేశ్‌ పేరున్న డైలాగ్‌ ఫన్నీగా ఉందని అన్నారు. ఇలా తన నుంచి చాలా కొత్త మాటలు విన్నా అలా తను దీని గురించి అంత ఎక్కువగా మాట్లాడేసరికి మా నమ్మకం రెట్టింపయ్యింది అని చెప్పుకొచ్చారు సుధీర్ బాబు.

Advertisement

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!