Rocket Raghava: జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఎంతోమంది ప్రస్తుతం ఇండస్ట్రీలో సెలబ్రిటీలుగా కొనసాగుతున్నారు.ఈ క్రమంలోనే జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతోమంది ఈ కార్యక్రమానికి వచ్చి వెళ్లిన వారు ఉన్నారు. అలాగే వెళ్లి తిరిగి ఈ కార్యక్రమానికి వచ్చిన వారు కూడా ఉన్నారు.
ఈ కార్యక్రమం మొదలైనప్పటి నుంచి ఈ కార్యక్రమాన్ని వదిలి వెళ్ళకుండా, ఒక ఎపిసోడ్ కూడా మిస్ కాకుండా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు రాకెట్ రాఘవ.

ఈ కార్యక్రమానికి ఎంతోమంది వస్తూ, వెళ్తూ ఉన్నప్పటికీ ఈయన మాత్రం ఈ కార్యక్రమాన్ని ఎలాంటి పరిస్థితులలోను వదిలిపెట్టలేదు. ఇకపోతే తాజాగా వచ్చేవారం ప్రసారం కాబోయే జబర్దస్త్ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల అయింది. ఈ ప్రోమోలో భాగంగా రాకెట్ రాఘవ జబర్దస్త్ రెమ్యూనరేషన్ గురించి స్కిట్ రూపంలో తెలియజేశారు.
ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి సంబంధించిన ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సందర్భంగా రాఘవ టెన్నిస్ క్రీడాకారిణిగా గెటప్ వేశారు.
ఇక టీమ్ మెట్ అయిన నాగి.. టెన్నిస్ ప్రత్యర్థిగా బరిలోకి దిగి స్టేజ్ పై ఎగురుతూంటాడు. ఈ క్రమంలోనే నాగి “రేయ్ నేను ఇంతగనం ఎగురుతుంటే.. అది గింత కూడా ఎగరట్లేదు ఎందుకురా? అంటాడు అందుకు రాఘవ మాట్లాడుతూ ఎగిరెగిరి దంచిన అది కూలీ, ఎగరకుండా దంచిన కూలీనే అంటూ సమాధానం చెప్పాడు.

Rocket Raghava: తక్కువ రెమ్యూనరేషన్ అందుకుంటున్న కంటెస్టెంట్లు…
ఇలా రాఘవ పరోక్షంగా ఈ కార్యక్రమంలో ఎలాంటి పర్ఫామెన్స్ చేసిన రెమ్యూనరేషన్ తక్కువగానే ఉంటుందని పరోక్షంగా మల్లెమాలవారికి రెమ్యూనరేషన్ పెంచమని ఇలా స్కిట్ రూపంలో తెలియజేశారని అర్థమవుతుంది. ఇకపోతే ఈ కార్యక్రమం సందర్భంగా రాఘవ చేసిన ఈ పర్ఫామెన్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జబర్దస్త్ కంటెస్టెంట్ ల పరిస్థితి మరి దారుణంగా ఉంది అసలు వీరికి సరైన రెమ్యూనరేషన్ కూడా ఇవ్వడం లేదా అంటూ కామెంట్లు చేస్తున్నారు.































