Roja: ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు మాజీ వైకాపా మంత్రి ఆర్కే రోజా సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేస్తూ గట్టి కౌంటర్ ఇచ్చారు. షర్మిల గత కొంతకాలంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై తప్పుడు ఆరోపణలు చేస్తూ ఆయన ప్రతిష్టకు భంగం కలిగిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఇటీవల కాలంలో అదానీ నుంచి జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున లంచం తీసుకున్నారంటూ షర్మిల మాట్లాడారు.

ఇక ఈ వ్యవహారంపై ఇటీవల వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి సేకీ ఒప్పంద సంస్థతో తాము విద్యుత్ ఒప్పందానికి కుదుర్చుకున్నటువంటి అగ్రిమెంట్స్ అన్నింటిని కూడా ఆధారాలతో సహా బయటపెట్టి అందరి నోరులు ముగించారు కానీ షర్మిల మాత్రం కొన్ని వార్తాపత్రికలలో రాసిన తప్పుడు వ్యాఖ్యలను పట్టుకొని తిరిగి జగన్మోహన్ రెడ్డి పై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు.

Roja:
ఈ క్రమంలోనే షర్మిల వ్యవహార శైలిపై మాజీ మంత్రి ఆర్కే రోజా స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా రోజా ట్వీట్ చేస్తూ షర్మిలా గారు మీకు తెలుగు ఇంగ్లీష్ అర్థం కాలేదా? నిన్న మీ అన్న జగన్మోహన్ రెడ్డి గారు సేకీ సమస్థతో కుదుర్చుకున్న విద్యుత్ ఒప్పందం గురించి రెండు భాషలలో చాలా వివరంగా ఆధారాలతో సహా చెప్పారు. అయినప్పటికీ మీరు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిపై బురదచల్లే ప్రయత్నం చేయడం భావ్యం కాదని తెలిపారు. 2021లో మే నెలలో సెకీ ఎక్కడ వేలం వేసింది? 2.14 పైసలకు ఎక్కడ అమ్మింది? అదానీ వద్ద గుజరాత్ కరెంటు కొనలేదు. గుజరాత్ ప్రభుత్వ విద్యుత్ కంపెనీ GUVNL అదే గుజరాత్‌లోని డిస్కంల నుంచి కొనుగోలు చేశాయి అంటూ రోజా షర్మిలకు కౌంటర్ ఇస్తూ చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.



























