Rrithvi Shaw: సెల్ఫీ అడిగితే ఇవ్వలేదని టీం ఇండియా స్టార్ క్రికెటర్ పృథ్వీ షా పై దాడి జరిగిన సంఘటన మనకు తెలిసిందే. ఇలా ఈయనపై దాడికి పాల్పడిన ఎనిమిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ కేసులో సరికొత్త ట్విస్ట్ బయటపడింది. ఇలా పృథ్వీ షా పై దాడి చేసిన వారిలో ఇంస్టాగ్రామ్ మోడల్ ఉండడం గమనార్హం.

మోడల్ పేరు సప్నా గిల్.. సోషల్ మీడియాలో ఈ అమ్మడికి ఉన్న ఫాలోయింగే వేరు. అయితే ఈ కేసులో ఈమెను కూడా పోలీసులు అరెస్టు చేశారు. పృథ్వీ సెల్ఫీ అడిగితే ఇవ్వలేదని సప్నా అతని గ్యాంగ్ కారు వద్ద కాపు కాచి మరి బేస్ బాల్ బ్యాట్ తో తన కారు పై దాడి చేశారని పృథ్వీ అతని స్నేహితుల పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ క్రమంలోనే పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు అయితే సప్నా మాట్లాడుతూ పృథ్వీ అతని స్నేహితులు తన పట్ల అనుచితంగా ప్రవర్తించారని తడిపై దాడికి ప్రయత్నించారంటూ ఆరోపణలు చేస్తున్నారు. ఇలా దాడికి పాల్పడుతున్న నేపథ్యంలో మేము ప్రతి దాడికి దిగామని సప్నా గిల్ ఆరోపణలు చేశారు.

Rrithvi Shaw:సప్నా గిల్ పై దాడికి ప్రయత్నించిన పృథ్వీ షా…
పృథ్వీ షా, అతడి స్నేహితులు కలిసి సప్నా గిల్ పై దాడి చేశారని సప్నా గిల్ లాయర్ అలీ ఖాషీప్ చెప్పారు. ఇక ఆమెను వైద్య పరీక్షలకు కూడా పంపలేదని లాయర్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈమెతో పాటు మరొక ఏడుగురు నిందితులను రేపు కోర్టులో హాజరు పరచనున్నట్టు పోలీసులు వెల్లడించారు. మరి ఈ వ్యవహారం ఎక్కడికి దారితీస్తుందో తెలియాల్సి ఉంది.




























