Connect with us

Featured

కరోనాతో భర్తను కోల్పోయిన మహిళలకు రూ.2.5 లక్షలు.. కొత్త పథకానికి శ్రీకారం చుట్టిన సీఎం?

Published

on

దేశవ్యాప్తంగా కరోనా రెండవ దశ ఎంతటి స్థాయిలో వ్యాపించి తీవ్ర ప్రళయాన్ని సృష్టించిందో మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఎంతోమంది ఈ మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. కుటుంబానికి అండగా ఉంటూ కుటుంబ పోషణను భరించే భర్త చనిపోతే ఆ కుటుంబం రోడ్డున పడాల్సిందే. అలా ఎన్నో కుటుంబాలు తమ కుటుంబ పెద్దను కోల్పోయి రోడ్డున పడ్డాయి. ఈ విధమైనటువంటి విపత్కర పరిస్థితులలో అస్సాం ప్రభుత్వం భర్తను కోల్పోయిన మహిళలకు ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది.

ఈ క్రమంలోనే అస్సాం ప్రభుత్వం కరోనా కారణం చేత భర్తను కోల్పోయిన మహిళల కోసం ‘ముఖ్యమంత్రి కోవిడ్-19 వితంతు సహాయ పథకం’ అనే సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకం కింద భర్తను కోల్పోయిన మహిళలకి రూ.2.5 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించనున్నట్లు అస్సాం ముఖ్యమంత్రి హిమాంత బిశ్వ శర్మ ప్రకటించారు.

ఈ విధమైనటువంటి పథకం కింద మహిళలు ఆర్థిక సహాయాన్ని పొందాలంటే కేవలం ఆ కుటుంబం వార్షిక ఆదాయం 5 లక్షల లోపు మాత్రమే ఉండాలి. అలాంటి వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని తెలిపారు. అదేవిధంగా ఈ పథకం ద్వారా మహిళలకు ఆర్థిక సహాయాన్ని అందించడమే కాకుండా యధావిధిగా వారికి వితంతు పెన్షన్ కూడా అందిస్తున్నట్లు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి తెలిపారు.

Advertisement

ఈ మహమ్మారి కారణంగా ఎంతోమంది విలువైన ప్రాణాలను కోల్పోయి అనేక కుటుంబాలలో తీవ్ర దుఃఖాన్ని మిగిల్చింది. ఈ వైరస్ కారణంగా భర్తని కోల్పోయిన మహిళలకు ఉపశమనం కలిగించడం కోసమే ఈ విధమైనటువంటి పథకానికి శ్రీకారం చుట్టినట్లు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ట్వీట్ చేశారు

ఈ విధమైనటువంటి ఆర్థిక సహాయాన్ని పొందాలనుకునే వారు తమ భర్త కరోనా కారణం వల్ల చనిపోయారని రాష్ట్రస్థాయి కోవిడ్ మరణాలు ఆడిట్ బోర్డు ధ్రువీకరించాల్సి ఉంటుంది.అలాగే, కుటుంబం వార్షిక ఆదాయం రూ.5 లక్షలలోపు ఉండాలని, కోవిడ్ కారణంగా ప్రభుత్వ ఉద్యోగి చనిపోతే వారి భార్యలకు ఈ పథకం వర్తించదని ఈ సందర్భంగా అస్సాం ముఖ్యమంత్రి తెలియజేశారు.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Vishal: మళ్లీ ఆయనే ఏపీ సీఎం.. హీరో విశాల్ కామెంట్స్ వైరల్!

Published

on

Vishal: సినీ నటుడు హీరో విశాల్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఈయన సినిమాలో పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గానే ఉంటారు. అంతేకాకుండా తమిళ రాజకీయాలలో కూడా ఈయన యాక్టివ్ గా ఉంటూ తరచూ రాజకీయాలకు సంబంధించిన విషయాల గురించి ప్రస్తావిస్తూ ఉంటారు.

ప్రస్తుతం హీరో విశాల్ నటించిన రత్నం సినిమా ఈనెల 26వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఇక ఈ సినిమా తెలుగులో కూడా విడుదల కానున్న నేపథ్యంలో ఈయన ప్రమోషన్ కార్యక్రమాల నిమిత్తం హైదరాబాద్ వచ్చారు ఇలా హైదరాబాద్ వచ్చినటువంటి ఈయనకు ఏపీ రాజకీయాల గురించి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి.

ఇలా రాజకీయాల గురించి ప్రశ్నలు ఎదురు కావడంతో ఈయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో కూడా గెలిచేది వైయస్ జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. ఆయనే మరోసారి ఏపీ సీఎం అవుతున్నారని విశాల్ వెల్లడించారు. ఇక జగన్మోహన్ రెడ్డి పట్ల ఇలాంటి దాడులు ఇదివరకు ఎన్నో జరిగాయి. వాటిని ఆయన ఎదుర్కొన్నారని తెలిపారు.

Advertisement

జగన్ అంటే అభిమానం..
ఇక్కడ తప్పకుండా వచ్చే ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారని అయితే నేను ఏ పార్టీని ఉద్దేశించి మాట్లాడలేదని తెలిపారు. తనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే విపరీతమైనటువంటి అభిమానం ఉందని ఈ సందర్భంగా విశాల్ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.

Advertisement
Continue Reading

Featured

Bigg Boss 8: బిగ్ బాస్ 8 లో మాజీ కంటెస్టెంట్లు.. మళ్లీ రచ్చ షూరు!

Published

on

Bigg Boss 8: బిగ్ బాస్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్నటువంటి వారు ప్రస్తుతం కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇలా ఇండస్ట్రీలో వరుస సినిమా అవకాశాలు అందుకున్నటువంటి పలువురు బిగ్ బాస్ సీజన్ సెవెన్ మాజీ కంటెస్టెంట్ లో తిరిగి సీజన్ 8 లో కంటెస్టెంట్లుగా పాల్గొన్న పోతున్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఇటీవల బిగ్ బాస్ 7 కార్యక్రమం ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇలా ఈ కార్యక్రమం ద్వారా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి సినీ నటుడు శివాజీ, అమర్ దీప్, విన్నర్ పల్లవి ప్రశాంత్ ఈ ముగ్గురు కూడా సీజన్ 8 కార్యక్రమంలో పాల్గొనబోతున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి.

సీజన్ 7లో అత్యధిక కంటెంట్ ఇచ్చింది ఈ ముగ్గురే. శోభ శెట్టి ఉన్నప్పటికీ ఆమె పట్ల అత్యంత నెగిటివిటీ నడిచింది. అమర్ దీప్ తో శివాజీ, పల్లవి ప్రశాంత్ ఫైట్స్ హైలెట్ అయ్యాయి. అందుకే ఈ ముగ్గురిని తిరిగి సీజన్ 8 లో కూడా తీసుకురావాలని ఆలోచనలో మేకర్స్ ఉన్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి తప్ప ఎక్కడ కూడా అధికారికంగా ప్రకటన మాత్రం వెలబడలేదు.

Advertisement

కార్తీకదీపం డాక్టర్ బాబు..
బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమంలో ఈ ముగ్గురి మధ్య పెద్ద ఎత్తున యుద్ధం నడిచింది అయితే తిరిగి ఈ ముగ్గురు మరోసారి సీజన్ 8 లో పాల్గొన్నారు. అంటే మరోసారి రచ్చ జరుగుతుందని పలువురు భావిస్తున్నారు. ఇక ఈ కార్యక్రమంలో ప్రశాంత్ విన్నర్ కాగా, అమర్ రన్నర్ గా నిలిచారు. ఇక ఈ కార్యక్రమంలో కార్తీకదీపం ఫేమ్ నిరుపమ్ రాబోతున్నారంటూ కూడా వార్తలు వస్తున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Prabhas: వేణు స్వామి ఇంటి నుంచి ప్రభాస్ అడిగి మరీ అవి తీసుకున్నారు: వేణు స్వామి వైఫ్

Published

on

Prabhas: ప్రముఖ జ్యోతిష్యుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వేణు స్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈయన సెలబ్రిటీలు అలాగే రాజకీయ నాయకులకు సంబంధించిన జాతకాలను చెబుతూ ఇటీవల కాలంలో వార్తల్లో నిలుస్తున్నారు.

ముఖ్యంగా ఈయన ప్రభాస్ జాతకం గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేసిన ప్రభాస్ అభిమానులు మాత్రం తీవ్రస్థాయిలో మండిపడుతూ ఉంటారు అంతేకాకుండా వేణు స్వామి పై భారీ స్థాయిలో ట్రోల్స్ చేస్తూ ఉంటారు. ఇలా సోషల్ మీడియాలో ప్రభాస్ అభిమానులు వేణు స్వామి మధ్య పెద్ద ఎత్తున మాటలు యుద్ధం జరుగుతుందని చెప్పాలి.

ఇలా వేణు స్వామి విషయంలో ఆయన అభిమానులు భారీ స్థాయిలో ట్రోల్ చేస్తున్నప్పటికీ వేణు స్వామి అలాగే ప్రభాస్ మధ్య మంచి అనుబంధమే ఉందని చెప్పాలి. ఈ విషయం గురించి తాజాగా వేణు స్వామి భార్య ఓ సందర్భంలో వెల్లడించారు. ఒకసారి తన తోటలో పండిన సీతాఫలం పండ్లను వేరే వారికి పంపించగా అవి ప్రభాస్ వద్దకు చేరాయి.

Advertisement

సీతాఫలం..
అవి తిన్న ప్రభాస్ చాలా బాగున్నాయని అడిగి మరి మా ఇంటి నుంచి తెప్పించుకున్నారు అంటూ వేణు స్వామి భార్య వీణ వాణి తెలిపారు. అంతేకాకుండా ఈమె ప్రభాస్ కోసం ప్రత్యేకంగా ఆర్గానిక్ హ్యాండ్ మేడ్ బ్యాగ్ ను కూడా తయారు చేసి కానుకగా పంపించినట్లు ఈ వీడియో ద్వారా వెల్లడించారు. ఇది చూసిన అభిమానులు మీరేమో ప్రభాస్ పై అభిమానం చూపిస్తారు మీ ఆయనేమో అలా మాట్లాడతారు అంటూ కామెంట్ చేస్తున్నారు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!