పెంపుడు జంతువులను పెంచుకునే ప్రియులు ఈ ప్రస్తుత రోజుల్లో ఎక్కువగా ఉంన్నారు. అయితే పిల్లులు, కుక్కలను ఎవరైనా ఇంట్లో పెంచుకుంటారు. కానీ రష్యాకు చెందిన వెరోనికా డిచ్కా అనే యువతి మాత్రం ఏకంగా ఒక అడవి ఎలుగుబంటితో స్నేహం చేస్తోంది. ఆమె దానిని ప్రేమగా దగ్గరకు తీసుకుంటూ పెంచుకుంటోంది.

ఆమె ఆ ఎలుగుబంటితో కలసి దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అవి వైరల్ గా మారాయి. ఎలుగుబంటితో కలిసి చేసిన ఫోటోషూట్లతో వెరోనికా ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయింది. ఆమె సోషల్ మీడియాలో ఫాలోవర్స్ సంఖ్య సైతం అనూహ్యంగా పెరిగింది. క్రూరమైన అడవి జంతువుతో సైతం ప్రేమగా వ్యవహరిస్తున్న వెరోనికా ధైర్యానికి సోషల్ మీడియా ఫాలోవర్స్ నుంచి ప్రశంసలు అందుకుంటోంది.
వెరోనికా దీనిని 2019లో సఫారీ పార్కులో పర్యటనకు వెళ్లినప్పుడు చూసిందని.. దానితో కాసేపు గడిపిన
తరువాత, వారి మధ్య స్నేహం ఏర్పడిందని ఆమె చెప్పుకొచ్చింది. దాని పేరు అప్పటి నుంచి ఆర్చీగా పిలుచుకుంటూ వస్తోంది. అప్పటి నుంచి ఆర్చీ, వెరోనికా ఇద్దరూ ఒకరినొకరు విడిచి ఉండలేనంతగా దగ్గరయ్యారు.
మాంసహారి అయిన ఎలుగుబంట్లు మనుషులపై దాడి చేసి గాయపర్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ వెరోనికాపై ఆర్చీ ఏనాడు దాడి చేయలేదని.. ఒక వేళ ఆర్చీ భయపడితే తన వెనుక వచ్చి దాచుకుంటుందని ఆమె చెప్పింది. ఏదేమైనా ఈ క్రూర జంతువుతో ఆమె స్నేహం చేయడంతో ఆమె పాపులారిటీ బాగా పెరిగిపోయింది.































