Sadha: పెళ్లి చేసుకుంటే అలా అస్సలు ఉండలేము… సంచలన వ్యాఖ్యలు చేసిన నటి సదా!

0
42

Sadha: జయం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్గా పరిచయమయ్యారు నటి సదా మొదటి సినిమాతోనే ఎంతో అద్భుతమైన నటన,అందం అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నటువంటి సదా అనంతరం తెలుగు తమిళ భాషలలో సినిమా అవకాశాలను అందుకొని ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.

ఇలా ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ సాధించినటువంటి ఈమె అనంతరం ఇండస్ట్రీకి దూరమయ్యారు. ప్రస్తుతం పలు సినిమాలలో వెబ్ సిరీస్ లలో నటిస్తూ ఉండడమే కాకుండా బుల్లితెర కార్యక్రమాల ద్వారా కూడా ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఇకపోతే సదాతో పాటు హీరోయిన్ గా వచ్చిన వారందరూ కూడా ఇప్పటికే పెళ్లిళ్లు చేసుకుని జీవితంలో సెటిల్ అయ్యారు.

ఇక సదా మాత్రం పెళ్లి గురించి అసలు మాట కూడా మాట్లాడటం లేదు అయితే పెళ్లి గురించి ప్రస్తావన వచ్చిన ప్రతిసారి ఏదో ఒక మాట చెబుతూ దాటవేస్తుంటారు. అయితే తాజాగా తాను పెళ్లి చేసుకోకపోవడానికి కారణం కూడా తెలిపారు. పెళ్లి చేసుకుంటే ఇప్పుడు ఉన్నంత సంతోషంగా ఉండలేమని ఫ్రీడం కోల్పోతామని తెలిపారు.

Sadha: ఫ్రీడమ్ కోల్పోతాము…


పెళ్లి చేసుకున్న తర్వాత మనల్ని అర్థం చేసుకున్న వారు వస్తే లైఫ్ బాగుంటుంది లేదంటే ఎంతో ఇబ్బందిగా ఉంటుందని తెలిపారు.ప్రస్తుత కాలంలో ఎంతోమంది విడాకులు తీసుకుని విడిపోతున్నారు అలాంటప్పుడు పెళ్లి చేసుకోవడం అవసరమా అందుకే తాను పెళ్లి చేసుకోలేదని తెలిపారు. ఇక తనకు వైల్డ్ లైఫ్ అంటే చాలా ఇష్టమని అందుకే తరచూ తను వైల్డ్ లైఫ్ ఎంజాయ్ చేయడం కోసం వెళ్తూ ఉంటానని ఈ సందర్భంగా సదా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.