మెగా హీరో సాయిధరమ్ తేజ్ శుక్రవారం సాయంత్రం రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి మనకు తెలిసిందే. ఈ ప్రమాద ఘటనలో సాయి ధరమ్ కుడి కన్ను, ఛాతిపై గాయాలైనట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గురైన సాయిధరమ్ తేజ్ అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో వెంటనే అక్కడే ఉన్నటువంటి మెడికవర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం సాయిధరమ్ తేజ్ ను మెరుగైన చికిత్స కోసం అపోలో ఆస్పత్రికి తరలించారు.

ప్రస్తుతం సాయిధరమ్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని ఎటువంటి ప్రమాదం లేదని వైద్యులు వెల్లడించారు. ఒక్కసారిగా మెగా హీరో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు అనగానే అభిమానులు కొంతవరకు ఆందోళన చెందారు.

సాయి తేజ్‌కు బైక్ రైడింగ్ అంటే ఆసక్తిదీంతో ఎప్పటిలాగే శుక్రవారం సాయంత్రం బయటకు వెళ్లిన సాయి తేజ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అయితే ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలియడంతో నెటిజన్లు పెద్దఎత్తున సాయితేజ్ ఉపయోగిస్తున్న అటువంటి బైక్ ఏది దాని ధర ఎంత ఉంటుంది అనే విషయాల గురించి పెద్ద ఎత్తున చర్చలు మొదలుపెట్టారు.బైక్ రైడింగ్ అంటే ఎంతో ఇష్టం ఉన్న సాయిధరమ్ తేజ్ ఉన్నఫలంగా యాక్సిడెంట్ కావడానికి గల కారణం అక్కడ బురద ఉండటం చేత బండి స్కిడ్ అయినట్లు తెలుస్తోంది.

ఇక సాయి తేజ్ వాడే బండి ఏంటి దాని ధర ఎంత అనే విషయానికి వస్తే.. సాయి ధరమ్ తేజ్ వాడే బండి పేరు ట్రయంప్ ట్రైడెంట్ రీసెంట్ గా ఈ బండిని హైదరాబాదులో కొనుగోలు చేశారు. TS07 GJ1258 అనే నెంబర్ తో రిజిస్ట్రేషన్ అయిన ఈ స్పోర్ట్స్ బైక్ 660 సీసీ ఇంజన్‌ను కలిగి ఉన్న హై ఎండ్ బైక్. సుమారు 7 లక్షల ఖరీదు చేసే ఈ బైక్ బరువు దాదాపు 189 కేజీల వరకు ఉంటుందని తెలుస్తోంది.































