Sai Dharam Tej: మెగా హీరో సాయి ధరమ్ తేజ్ గతంలో రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి అందరికీ తెలిసిందే. ఆ సమయంలో అబ్దుల్ ఫర్హాన్ అనే వ్యక్తి సాయి ధరమ్ తేజ్ ని గుర్తించి సరైన సమయంలో ఆస్పత్రిలో చేర్చటం వల్ల సాయి ధరమ్ తేజ్ ఈరోజు ఇలా ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే అబ్దుల్ గురించి గత కొన్ని రోజులగా సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి.

సాయి ధరమ్ తేజ్ ని కాపడినందుకు మెగా కుటుంబం అతనికి పెద్దమొత్తంలో డబ్బు సాయం చేసిందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇటీవల ‘ విరూపాక్ష ’ సినిమా ప్రమోషన్స్‌లో అబ్దుల్ గురించి అతనికి చేసిన సహాయం గురించి సాయి ధరమ్ తేజ్ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. తన ప్రాణాలు కాపాడిన వ్యక్తికి డబ్బులు ఇచ్చి చేతులు దులుపుకోవడం మానవత్వం కాదని, అతడికి తన కాంటాక్ట్ నంబర్ ఇచ్చి అండగా ఉంటానని హామీ ఇచ్చానట్లు తెలిపాడు.
సాయి ధరమ్ తేజ్ ఇలా చెప్పటంతో మీడియా అబ్దుల్‌ను కలసి తేజ్ చెప్పిన మాటలలో వాస్తవం ఎంత ఉందని అడగగా… తనను సాయి తేజ్ లేదా మెగా కుటుంబం నుంచి ఎవరూ కలవలేదన్నారు. తనకు సాయం చేసేందుకు ఎవరూ ఫోన్ చేయలేదని , వారి వల్ల ఉన్న ఉద్యోగం కూడా వదులుకోవాల్సి వచ్చిందని తెలిపాడు.
దీంతో సోషల్ మీడియాలో సాయి ధరమ్ తేజ్ ని ట్రోల్ చేస్తున్నారు. అయితే ఈ విమర్శలపై స్పందించిన సాయిధరమ్ తేజ్ స్పందిస్తూ..

Sai Dharam Tej: రుణపడి ఉంటాను…
తన మీద, తన టీమ్ మీద కొన్ని అసత్య ప్రచారాలు జరుగుతున్నాయని, అబ్దుల్ ఫర్హాన్‌కు ఆర్థికంగా సాయం చేసినట్లు తాను ఎక్కడా చెప్పలేదని స్పష్టం చేశాడు. అబ్దుల్ తనకు చేసిన సాయానికి తాను, తన కుటుంబం ఎప్పటికీ రుణపడి ఉంటానని తెలిపాడు. అంతే కాకుండా ఏ అవసరం వచ్చినా అబ్దుల్ ఫర్హాన్ ఎప్పుడైనా మేనేజర్ ద్వారా తనను కలవొచ్చని, అతని మంచి కోసం నేను ఎంత దూరమైన వెళ్తానని సాయి ధరమ్ తేజ్ క్లారిటీ ఇచ్చాడు. ఈ కాంట్రవర్సీ మీద ఇదే తన చివరి స్పందన అని సాయి తేజ్ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.
To whomsoever it may concern..
Thank You
Sai Dharam Tej. pic.twitter.com/qJr3SYYJ6B
— Sai Dharam Tej (@IamSaiDharamTej) April 27, 2023

































