Sai Dharam Tej: ఇంకెక్కడి పెళ్లి బ్రో… పెళ్లి గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన సాయి ధరమ్ తేజ్!

0
56

Sai Dharam Tej: మెగా మేనల్లుడు సాయి ధరంతేజ్ ప్రమాదం నుంచి బయటపడిన తర్వాత వరుస సినిమాలలో నటిస్తూ ఇండస్ట్రీలో బిజీగా గడుపుతున్నారు. తాజాగా విరూపాక్ష సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈయన ప్రస్తుతం బ్రో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ఈ సినిమా ఈ నెల 28వ తేదీ విడుదల కానుండడంతో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

నటుడు సముద్రఖని దర్శకత్వంలో ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కూడా కీలకపాత్రలో నటించారు. ఇలా పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్లో రాబోతున్నటువంటి ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో తిరుపతిలో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సాయిధరమ్ తేజ్ పెళ్లి గురించి పలు ఆసక్తికరమైన విషయాలు తెలిపారు.

ఈ సందర్భంగా సాయి ధరమ్ తేజ్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు అంటూ అభిమానులు ఆయనను ప్రశ్నించారు. అయితే ఈ ప్రశ్నకు సాయి ధరమ్ తేజ చెప్పినటువంటి సమాధానం అందరికీ కాస్త నవ్వు తెప్పిస్తుంది. ఇంకెక్కడి పెళ్లి బ్రో ఈ సినిమా టైటిల్ విడుదలకు ముందు వరకు ఎవరో ఒకరిని ట్రై చేసుకోవచ్చు అనుకున్నాను అయితే ఈ సినిమా టైటిల్ విడుదల అయిన తర్వాత ప్రతి ఒక్కరు తనని బ్రో అని పిలవడం మొదలుపెట్టారు అంటూ సమాధానం చెప్పారు.

Sai Dharam Tej అందరికీ బ్రో అయ్యాను…


ఈ విధంగా ఈ సినిమా టైటిల్ విడుదలైన తర్వాత అందరూ తనని బ్రోగానే భావిస్తున్నారు అంటూ పెళ్లి గురించి సాయిధరమ్ తేజ్ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక సాయి ధరంతేజ్ విరూపాక్ష సినిమా ద్వారా మంచి సక్సెస్ అందుకున్నారు. అయితే విరూపాక్ష వంటి సక్సెస్ తర్వాత ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి బ్రో చిత్రం ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో తెలియాల్సి ఉంది.