Sai Pallavi: ఇటు ఫర్ఫామెన్స్ తో పాటు గ్లామర్ కూడా కావాలంటే.. సాయిపల్లవే కరెక్ట్ అనే భావన ఇటు హీరోల్లోనూ.. అటు డైరెక్టర్ల లోనూ నాటుకుపోయింది. సినిమా చిన్నాదా… పెద్దదా అని చూడకుండా తన పాత్ర బాగుంటే సినిమాను ఖచ్చితంగా ఒప్పుకుంటోంది సాయిపల్లవి. ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ భామ చాలా మంది ఫ్యాన్స్ ను సంపాదించుకుంది. ఇటు తెలుగు, అటు తమిళ్ , మళయాళం సినిమాలు చేస్తోంది ఈ భామ.

మళయాళంలో ప్రేమమ్ సినిమా తన నటనతో కేరళ కుర్రకారును అలరించింది. ముఖ్యంగా ప్రేమమ్ సినిమా అక్కడ భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ప్రస్తుతం ఈ భామ నాని సరసన శ్యామ్ సింగరాయ్ సినిమాలో నటిస్తోంది. ఇప్పటికే ఈసినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. మరో వైపు వేణు ఉడుగుల దర్శకత్వంలో రానా సరసన విరాట పర్వంలో నటిస్తోంది. నక్సలైట్ బ్యాక్ డ్రాప్ లో నడిచే ఈ సినిమాలో సాయిపల్లవి పాత్ర కీలకంగా ఉన్నట్లు తెలుస్తోంది.

సంపాదన పరంగా సమంత, అనుష్కల సరసన సాయి పల్లవి చేరిందనే వార్తలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా సాయిపల్లవి తన సినిమాల ద్వారా ఎక్కువగానే సంపాదిస్తుందని తెలుస్తోంది. అయితే క్యారెక్టర్ పరంగా తన పాత్రకు మంచి స్థానం ఉండాలని సాయిపల్లవి అనుకుంటుంది. గతంలో కూడా కొంత మంది స్టార్ హీరోల సినిమాలను కూడా తిరస్కరించింది.
2021 సంవత్సరంలో దాదాపు 3 మిలియన్ డాలర్లకు పైగా..
మహిళల క్యారెక్టర్లను కించపరిచే విధంగా ఉన్నాయంటూ.. కొన్ని క్రేజీ యాడ్స్ ను కూడా వదులుకుంది. దీని వల్ల సాయిపల్లవి రూ. 5-6 కోట్లను కోల్పోయిందట. ఓ సర్వే సంస్థ ప్రకారం 2021 సంవత్సరంలో దాదాపు 3 మిలియన్ డాలర్ల వరకు సంపాదించినట్లు వెల్లడించింది. దీంతో సమంత, అనుష్క సరసన చేరిందట. ప్రస్తుతం సమంత సినిమాకు రూ. 3 కోట్ల వరకు తీసుకుంటుండగా… అనుష్క రూ.2 కోట్లు తీసుకుంటుందట. సాయిపల్లవి సినిమాకు రూ. 1-1.5 కోట్లు రెమ్యూనరేషన్ గా తీసుకుంటుందని సమాచారం.
































