God Father Movie: మలయాళంలో ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్న లూసిఫర్ చిత్రాన్ని తెలుగులో గాడ్ ఫాదర్ చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. మోహన్ రాజా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నారు.మెగాస్టార్ చిరంజీవి చాలా కాలం తరువాత నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాలో బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

తాజాగా ముంబైలో సల్మాన్ ఖాన్ చిరంజీవి మధ్య సన్నివేశాలను చిత్రీకరించారు అయితే సల్మాన్ ఖాన్ పై చిత్రీకరించాల్సిన సన్నివేశాలు పూర్తి కావడంతో దర్శకుడు మోహన్ రాజా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.ఇక ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ ఎలాంటి రెమ్యూనరేషన్ లేకుండా నటించారు అనే విషయం మనకు తెలిసిందే.అయితే ఈయన ఏ విధమైనటువంటి రెమ్యూనరేషన్ లేకుండా నటించడానికి గల కారణాలు ఏమిటి అనే విషయానికి వస్తే..

మెగాస్టార్ చిరంజీవి పై ఉన్న అభిమానం కారణంగానే ఈ సినిమాకి సల్మాన్ ఖాన్ ఏ విధమైనటువంటి రెమ్యునరేషన్ తీసుకోలేదు.అదే విధంగా చరణ్ సినిమాకి సల్మాన్ సపోర్ట్ చేయడం, సల్మాన్ సినిమాకు సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇకపోతే చరణ్ సల్మాన్ ఖాన్ మధ్య వ్యాపార సంబంధాలు కూడా ఉన్నాయని సమాచారం.ఈ విధంగా మెగా కుటుంబానికి సల్మాన్ ఖాన్ కి మధ్య మంచి అనుబంధం ఉండటం వల్ల ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ ఎలాంటి రెమ్యూనరేషన్ లేకుండా నటించారని తెలుస్తోంది.
పాన్ ఇండియా స్థాయిలో…
చిరంజీవి సినిమా కోసం అడగగానే ఆయనపై ఉన్న గౌరవంతో సల్మాన్ ఖాన్ సినిమాలో నటించారు. ఇక ఇందులో సల్మాన్ ఖాన్ లూసీఫర్ లో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన పాత్రలో నటించారు. మోహన్ లాల్ కి సమస్య ఎదురైనప్పుడు పృధ్విరాజ్ ఎంట్రీ ఇచ్చిన విధంగా ఈ సినిమాలో కూడా చిరంజీవి ఆపదలో ఉన్న సమయంలో సల్మాన్ ఖాన్ ఎంట్రీ ఇవ్వనున్నారని ఈయన పాత్ర ఎంతో కీలకంగా ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ఈ ఏడాది చివర్లో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.































