Salman Khan: బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇటీవల పన్వెల్ వీధుల్లో ఆటో రిక్షా నడుపుతూ కనిపించాడు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. నీలిరంగు టీ-షర్టు, షార్ట్స్ , క్యాప్ ధరించి వాహనాన్ని సులభంగా నడుపుతూ, బాటసారులను ఉత్సాహపరుస్తూ కనిపించాడు.

అతడిని ఆ పొజిషన్లో చూసి అభిమానులు కేరింతలు కొట్టారు. అతడితో సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు. ఇటీవల అతడు తన 56వ పుట్టిన రోజు జరుపుకున్న విషయం తెలిసిందే. అతడు తన పుట్టిన రోజు వేడుకలను ఎప్పటిలాగా తన నివాసంలో జరుపుకున్నాడు. అర్పితా ఖాన్, ఆయుష్ శర్మతో సహా అతని కుటుంబ సభ్యులు , సన్నిహితులు పన్వెల్‌లోని అతని ఫామ్‌హౌస్‌లో అతని పుట్టినరోజు వేడుకకు హాజరయ్యారు.

జెనీలియా తో కలిసి సల్మాన్ డ్యాన్స్ చేస్తూ.. తన మేనకోడలితో కలిసి బర్త్‌డే కేక్ కట్ చేస్తున్న పలు ఫోటోలు, వీడియోలు ఆన్‌లైన్‌లో చక్కర్లు కొట్టాయి. ఈ సల్లుభాయ్ తన పుట్టినరోజుకు ఒక రోజు ముందు తన ఫామ్‌హౌస్‌లో పాము కాటుకు గురై.. వెంటనే చికిత్స కోసం కమోతేలోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అదే రోజు డిశ్చార్జి అయ్యాడు.
ఆటోలో పాము లేదా..
అతడు సురక్షితంగా ఉండటంతో తన అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. ఇక అతడి సినిమాల విషయానికి వస్తే.. ‘టైగర్ 3’ లో కత్రినా కైఫ్‌తో కలిసి కనిపించనున్నాడు. అతను ‘కభీ ఈద్ కభీ దివాలీ’ మరియు ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్ అయిన ‘పవన్ పుత్ర భాయిజాన్’లో కూడా కనిపించనున్నాడు. తాజాగా అతడు ముంబైలో రద్దీగా ఉండే రోడ్లపై ఆటో రిక్షా నడుపుతూ కనిపించాడు. యాక్షన్ సీన్లు, డ్యాన్‌లతో అలరించే ఈ భాయిజాన్ ఆటో నడపడం చూసిన ప్రజలు ఆశ్చర్యపోయారు. ఈ వీడియో ప‍్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఇక ఈ వీడియోపై పలువుకు నెటిజన్లు వివిధ రకాలుగా స్పందించారు. అది ప్రమాదకరం.. అని ఒకరు కామెంట్ చేస్తే.. ఆటోలో పాము లేదా అంటూ.. మరొకరు కామెంట్ చేశారు. ఏదేమైనా ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

































