Samantha: సమంత తీసుకున్న ఆ నిర్ణయం వల్ల 12 కోట్లు నష్టమా… అసలు ఏం జరిగిందో తెలుసా?

0
45

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాలకు కాస్త విరామం ప్రకటించారు.ఈమె ఆరోగ్యంపై దృష్టి పెడుతూ కొంతకాలం పాటు సినిమాలకు విరామం ఇచ్చి అనంతరం సినిమాలలో నటించాలని నిర్ణయం తీసుకున్నారు.సమంత విడాకుల తర్వాత వరుస సినిమాలకు కమిట్ అయ్యారు. అయితే ఈమెకు పూర్తిగా అనారోగ్యం చేయడంతో తాను కమిట్ అయిన సినిమా షూటింగ్ పనులను పూర్తి చేసుకున్నారు.

ఈ విధంగా తన సినిమా షూటింగ్ పనులు అన్నింటిని పూర్తి చేసుకున్నటువంటి సమంత మరికొన్ని సినిమాలకు కమిట్ అవుతూ అడ్వాన్సులు కూడా తీసుకున్నారు.అయితే గతంలో ఈ మాయోసైటిసిస్ బారిన పడిన సంగతి తెలిసిందే. ఆ వ్యాధి కారణంగా మరోసారి సమంత బాగా సఫర్ అవుతున్నట్టు తెలుస్తుంది. అందుకే సినిమాలకు విరామం ప్రకటించి ఆరోగ్యంపై దృష్టి పెట్టారు.

ఎలాంటి ఒత్తిడి టెన్షన్ లేకుండా పూర్తిగా తన ఆరోగ్యం పైనే ఈమె దృష్టి పెట్టారు. దీంతో తాను కమిట్ అయినటువంటి సినిమాలకు తీసుకున్నటువంటి అడ్వాన్సుల్ కూడా తిరిగి వెనక్కి ఇచ్చారు. ఇలా సమంత దాదాపు మూడు భారీ ప్రాజెక్టులకు కమిట్ అయ్యారని తెలుస్తుంది.

Samantha: అడ్వాన్సులు వెనక్కి ఇచ్చిన సమంత…


ఈ విధంగా సమంత ఏకంగా మూడు సినిమాలకు కమిట్ కావడంతో ఒక్కో సినిమాకు నాలుగు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ చొప్పున సమంత 12 కోట్ల రూపాయలను నష్టపోయారని తెలుస్తోంది. అయితే తనకు డబ్బు కన్నా తన ఆరోగ్యమే ముఖ్యమని భావించిన సమంత ఇలా సినిమాలను వదులుకొని పూర్తిగా ఆరోగ్యం పైనే దృష్టి పెట్టారు. ఇక ఈమె చికిత్స నిమిత్తం అమెరికా వెళ్ళబోతున్నారని తెలుస్తుంది.