Samantha: సమంత విడాకుల తర్వాత తన కెరీర్ పై ఎక్కువగా శ్రద్ధ వహిస్తోంది. వచ్చిన ఏ ఆఫర్ ను ఆమె తిరస్కరించడం లేదు. లేడీ ఓరియంటెడ్ చిత్రాలను ప్రాధాన్యత ఇస్తూ.. తన నటనకు ప్రశంసలు అందుకుంటుంది సమంత. ఇక ఆమె ‘యశోద’ సినిమా తర్వాత వెబ్ సిరీస్ కు ఓకె చెప్పింది.. దాంతో పాటే.. మరో సారి ఎన్టీఆర్, కొరటాలశివ కాంబోలో నటించనుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ఆర్ఆర్ఆర్ విడుదలకు కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నందున .. నటుడు జూనియర్ ఎన్టీఆర్ తన తదుపరి చిత్రం కోసం సన్నాహాలు ప్రారంభించాడు. దీని కోసం నిర్మాతలు ఎన్టీఆర్ సరసన జత కట్టేందుకు సమంతను అడిగారట. జూనియర్ ఎన్టీఆర్‌కి కొరటాల శివ దర్శకత్వంలో నటించే ఆఫర్ వచ్చింది. ఇది భారీ బడ్జెట్ చిత్రంగా రూపుదిద్దుకుందట.

ఇక దీనికి సమంత హీరోయిన్ గా అనుకుంటున్నట్లు టాక్. ఇక ప్రస్తుతం సమంత శాకుంతలం సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. దాదాపు ఈసినిమా పూర్తి కావస్తోంది. అలాగే ప్రస్తుతం సామ్ ప్రధాన పాత్రలో యశోద సినిమా తెరకెక్కుతుంది. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది.
దీని తర్వాతి ప్రాజెక్ట్ ఆమె దాదాపు కొరటాల శివ దర్శకత్వంలో చేసే అవకాశం ఉందట.
సంక్రాంతి తర్వాత లాంఛనంగా ప్రారంభం:
మునుపెన్నడూ లేని విధంగా సమంత పాత్రను ఎలివేట్ చేసే స్క్రిప్ట్‌ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ విడుదల తర్వాత.. జూనియర్ ఎన్టీఆర్ , కొరటాల షూటింగ్ ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నారు. సంక్రాంతి తర్వాత హైదరాబాద్‌లో లాంఛనంగా ‘పూజా’ కార్యక్రమాన్ని నిర్వహించి సినిమాను లాంఛనంగా ప్రారంభించేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. దర్శకుడు కొరటాల శివ , సమంత, జూనియర్ ఎన్టీఆర్ గతంలో ‘ జనతా గ్యారేజ్ ‘ కోసం కలిసి పనిచేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరోసారి ఈ కాంబోలో మరో సినిమా తెరమీదకు రాబోతోంది.

































