Samantha : సమంతా.. సౌత్ సినిమా పరిశ్రమలో టాప్ హీరోయిన్. గ్లామర్ బ్యూటీగా అద్భుత సినిమాలు చేసి.. చక్కటి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ నటనా ప్రాధాన్యత ఉన్న సినిమాలను మాత్రమే చేస్తుంది. అయితే ది ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ తర్వాత తన నిర్ణయం పూర్తిగా మార్చుకుందట. ఇకపై తాను ఛాలెంజింగ్ రోల్స్ మాత్రమే చేయాలి అనుకుంటున్నట్లు వెల్లడించింది. ఏ సినిమాలోనూ ఇకపై గ్లామర్ పాత్రలు చేయనని చెప్పింది.

సమంతా తాజాగా చేసిన వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ 2. ఈ సిరీస్ లో సమంతా పోషించిన రాజీ పాత్ర పలువురి ప్రశంసలు అందుకుంది. ఈ పాత్రలో సమంతా మాత్రం ఒదిగిపోయి నటించింది. ఆమె పాత్రకు పలు అవార్డులు సైతం దక్కాయి. ఈ సిరీస్ తో సమంతకు ఉత్తమ నటిగా ఓటీటీ ఫిల్మ్ ఫేర్ అవార్డు వచ్చింది. అటు మోస్ట్ పాపులర్ ఓటీటీ యాక్టర్స్ లిస్ట్ లో నాలుగో స్థానంలో నిలిచింది. బాలీవుడ్ నుంచి కూడా సమంతకు మంచి ఆఫర్స్ వస్తున్నాయి. తాజాగా సమంత చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఓ నేషనల్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు చెప్పింది.

వాస్తవానికి తను నటించిన ఫ్యామిలీ మ్యాన్ 2లోని రాజీ పాత్రకు అనుకున్నదాని కంటే ఎక్కువ అభినందనలు వచ్చాయని చెప్పింది సమంత. ఈ సిరీస్ తో కొత్త ఛాలెంజెస్ తీసుకునే సత్తా ఏర్పడిందని చెప్పింది. ఇప్పటి వరకు తాను అందానికి ప్రాధాన్యత ఉన్న సినిమాల్లోనే నటించానని వెల్లడించింది. అయితే ఇకపై ఇలాంటి పాత్రలను పోషించనని చెప్పింది. నటిగా ఇకపై నటనా ప్రాధాన్యత ఉన్న సినిమాలనే చేస్తానని వెల్లడించింది. ప్రస్తుతం సమంతా శాకుంతలం అనే సినిమా చేస్తుంది. షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ప్రస్తుతం యశోద అనే సినిమా చేస్తుంది. ఎరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్ అనే హాలీవుడ్ మూవీ కూడా చేస్తుంది ఈ ముద్దుగుమ్మ.

Samantha : సమంత తీరును పూర్తిగా మార్చేసిన వెబ్ సిరీస్
మొత్తంగా సమంత తీరును పూర్తిగా మార్చేసింది ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్. ఇక పెళ్లి తర్వాత సైతం ఎక్సపోసింగ్ కి తెర లేపిన సమంత విడాకుల అనంతరం మరింత రెచ్చిపోయి అందాల ఆరబోత చేస్తుంది. మరో వైపు హిందీ సినిమాలు, బాలీవుడ్ లో అవకాశాల వలనే సమంత నాగ చైతన్య కు విడాకులు ఇచ్చింది అనే వార్తలు సైతం నెట్టింట్లో షికార్లు చేసాయి. ఏది ఏమైనా సామ్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఒక వర్గం ప్రేక్షకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.































