Samantha: నాగ చైతన్యతో సమంత విడాకులు తీసుకోవడం అన్ని ఇండస్ట్రీల్లోనూ చర్చకు దారి తీసింది. ‘ఏమాయ చేశావే’ సినిమా చేస్తున్న సమయంలో ఇద్దరు ప్రేమించుకోవడం 2017 లో పెళ్లి చేసుకోవడం జరిగింది. అయితే ఏమైందో తెలియదు కానీ.. గతేడాది అక్టోబర్ 2న ఈ ఇద్దరు విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు.

ఈ వార్త వారి ఫ్యాన్స్ కు కాస్త బాధ కలిగించింది. అయితే ఈ వ్యవహారంపై సమంత విపరీతంగా ట్రోలింగ్, కామెంట్లను ఎదుర్కొంది. ఒకానొక దశలో తీవ్ర డిప్రెషన్ లోకి వెళ్లింది. సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానెళ్లలో వస్తున్న కామెంట్లు, ట్రోలింగ్ పై పరువునష్టం కింద కోర్ట్ కు వెళ్లింది.

ఇదంతా ఒకెత్తు అయితే… తాజాగా సినిమాలతో సమంత ప్రస్తుతం బిజీగా మారింది. వరసగా సినిమాలను చేస్తోంది. ఇప్పటికే పుష్ప సినిమాలో ‘ ఊ అంటావా మావా ఊఊ అంటవా’ పాట చాల పెద్ద హిట్ అయింది. రికార్డ్ స్థాయిలో వ్యూస్ దక్కించుకుంది. ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో ప్యాన్ ఇండియా మూవీగా ‘శాకుంతలం’ చేస్తోంది. మరోవైపు తెలుగు, తమిళ భాషల్లో ‘యశోద’ సినిమా చేస్తోంది.
సోషల్ మీడియా వేదికగా సామ్‌ను ..
ఇదిలా ఉంటే సమంత ప్రెగ్నెన్సీ వివాదంతోనే నాగ చైతన్యతో విడిపోయినట్లు వార్తలు వచ్చాయి. అక్కినేని ఫ్యామిలీ పిల్లల్ని కనాలని ఒత్తడి చేసిందని.. పిల్లల్ని కంటే తన అందం దెబ్బ తిని సినిమా అవకాశాలు తగ్గిపోతానే కారణంతోనే చైతుకు ఆమె విడాకులు ఇచ్చేసిందని ప్రచారం జరిగింది. ఇదిలా ఉంటే కొందరు నెటిజన్లు గర్భధారణకు మీరు వ్యతిరేకమా అంటూ కూడా సోషల్ మీడియా వేదికగా సామ్‌ను ప్రశ్నించారు. అప్పుడు సమంత స్టన్నింగ్ సమాధానాలు ఇచ్చింది. ఇక తాజాగా సమంతకు మీరు ప్రెగ్నెంట్ అని అడిగితే షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది.నేను 2017 నుండి గర్భవతిని. ఈ పాప నిజంగా బయటకు రావాలని కోరుకోవడం లేదు, అంటూ సెటైరికల్‌గా చెప్పింది సమంత. ఇటీవల కాజల్ ప్రెగ్నెన్సీ విషయాన్ని ధ్రువీకరించింది. ఈ హ్యపీ విషయంపై సమంత కూడా స్పందించింది. అందమైన పడుచుపిల్ల ఎంత మెరిసిపోతుందో చూడండి. నీపై చాలా ప్రేమ ఉంది ప్రియమైన కాజ్…సంతోషంగాను ఉంది. చాలా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అంటూ పేర్కొంది. ఈ వ్యాఖ్యలతో సమంత గర్భధారణకు వ్యతిరేఖం కాదని తెలుస్తోంది.
































