Samantha: సమంత నాగచైతన్య విడాకులకు కారణాలను చైతన్య ఇటీవల ఓ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో తెలియజేశారు. మా గురించి వచ్చిన రూమర్స్ కారణంగానే ఇద్దరు విడాకులు తీసుకోవడానికి కారణం అయ్యాయి అంటూ చైతన్య చెప్పుకొచ్చారు. అంతేకాకుండా మేము చట్ట పరంగా విడాకులు తీసుకొని కూడా రెండు సంవత్సరాలు అయింది. అయినా మా విడాకుల గురించి ఏదో ఒక వార్త వస్తుందని ఇప్పటికైనా ఈ వార్తలను ఆపండి అంటూ ఈయన చెప్పుకొచ్చారు.

ఇలా తమ విడాకుల ప్రస్తావన తీసుకురావద్దు అంటూ నాగచైతన్య చెప్పినప్పటికీ వీరి విడాకుల గురించి తరచూ ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. అయితే సమంత నాగచైతన్య విడాకులకు కారణం నాగచైతన్య సమంతను పెట్టిన టార్చర్ అంటూ మరో వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి సమంత చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. పెళ్లికి ముందు పెళ్లి తర్వాత చైతన్యలో ఏదైనా మార్పు వచ్చిందా అంటూ ఓ కార్యక్రమంలో భాగంగా యాంకర్ సమంతను ప్రశ్నించారు. అయితే ఈ ప్రశ్నకు సమంత సమాధానం చెబుతూ మార్పు రాలేదు కానీ కొన్ని కండిషన్స్ పెట్టారు అంటూ సమంత చెప్పుకొచ్చారు.

Samantha: సినిమాల గురించి మాట్లాడకూడదు..
పెళ్లి తర్వాత సాయంత్రం ఆరు దాటితే తాను సినిమాల గురించి ఒక్క మాట కూడా మాట్లాడకూడదని నాగచైతన్య తనకు కండిషన్ పెట్టారని తెలుస్తోంది. అయితే ఈ కండిషన్ భరించలేని టార్చర్ అంటూ ఈమె తెలిపారు.ఎందుకంటే సమంత సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ అలాంటిది 6 గంటల తర్వాత సినిమాల గురించి మాట్లాడుకూడదు అంటే అది కుదరని పని అని తెలుస్తుంది. ఇలా ఈ విషయం గురించి గొడవలు వచ్చి విడిపోయారా అంటూ కూడా వార్తలు వస్తున్నాయి.