Samantha: సమంత ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూనే మరోవైపు తాను నటించిన శాకుంతలం సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో కూడా ఎంతో బిజీగా ఉన్నారు. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఏప్రిల్ 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో సమంత ప్రమోషన్ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటున్నారు.

ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా తన వ్యక్తిగత విషయాల గురించి కూడా ప్రస్తావిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సమంత తన వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న విషయం మనకు తెలిసిందే.నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈమె ఎక్కువ కాలం తనతో సంతోషంగా లేదని చెప్పాలి. నాగచైతన్యతో వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకున్న సమంత తన కెరియర్ పై ఫోకస్ పెట్టారు.
ఇలా వరుస సినిమాలకు కమిట్ అవుతూ కెరియర్ పై దృష్టిపెట్టిన ఈమెను మయోసైటిస్ అనే వ్యాధి వెంటాడింది. అయితే ఈ వ్యాధి నుంచి బయటపడిన సమంత తిరిగి వరుస సినిమా షూటింగులతో బిజీ అయ్యారు.అయితే ఈ విషయాల గురించి ఈమె ప్రస్తావిస్తూ ప్రతి ఒక్కరి జీవితంలోను ఎన్నో సమస్యలు ఉంటాయి. ఇలా సమస్యలు వచ్చినప్పుడు ఎంతో స్ట్రాంగ్ అవుతూ ఉంటారు. ఒకప్పుడు నా జీవితంలో ఏ విధమైనటువంటి సమస్యలు ఇబ్బందులు లేవు చాలా హ్యాపీగా ఉన్నాను.

Samantha:ఒకప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను…
అయితే అందరిలాగే తన జీవితంలో కూడా ఇబ్బందులు వచ్చాయని ఈమె తెలియజేశారు.అయితే నా జీవితంలో నాకు కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు ఎదురయ్యాయి. ఆ పరిస్థితులు నా జీవితాన్ని నాశనం చేయకూడదని కోరుకుంటూ ఆ సమయంలో నేను మరింత స్ట్రాంగ్ అయ్యానని ఈ సందర్భంగా సమంత చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
































