Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సమంత ప్రస్తుతం సిటాడల్ ఇండియన్ వెర్షన్ లో నటిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ హాలీవుడ్ వెర్షన్లు ప్రియాంక చోప్రా నటించారు. అయితే తాజాగా ఈ వెబ్ సిరీస్ చివరి వెర్షన్ గత కొద్ది రోజుల క్రితం విడుదలైన విషయం తెలిసింది.

ఇక వెబ్ సిరీస్ లో ప్రియాంక చోప్రా కాస్త బోల్డ్ సన్నివేశాలలో కూడా నటించిన సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ వెబ్ సిరీస్ ఇండియన్ వెర్షన్ లోకి రీమేక్ కావడంతో ఇందులో కూడా సమంత అలాంటి బోల్డ్ సన్నివేశాలలో నటిస్తున్నారా అన్న సందేహం అందరికీ కలుగుతుంది.అయితే సమంత ఇలాంటి సన్నివేశాలలో నటించబోతున్నారని విషయం తెలియడంతో అభిమానుల సైతం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఈ వార్తలు సమంత టీం వరకు చేరడంతో ఈ వార్తలపై సమంత టీమ్ స్పందిస్తూ ఈ వార్తలను కొట్టి పారేశారు.సమంత మరి అలాంటి బోల్డ్ సన్నివేశాలలో నటించడం లేదంటూ ఈ వార్తలను ఖండించడంతో సమంత అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. ఇక ఈ విషయంపై సమంత ఫ్యాన్స్ స్పందిస్తూ ఇదేదో ది ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ కి ముందు కూడా ఇలాంటి సన్నివేశాలలో నటించకపోయి ఉంటే బాగుండేదని భావిస్తున్నారు.

Samantha: విడాకులకు ఆ వెబ్ సిరీస్ కారణమా…
ఈ వెబ్ సిరీస్ లో నటించక పోయి ఉంటే చైతన్యతో విభేదాలు వచ్చేవి కాదు కదా ఇద్దరు విడాకులు తీసుకొని విడిపోయేవారు కాదు కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి బోల్డ్ సన్నివేశాలలో సమంత నటించడంతోనే నాగచైతన్యతో తనకు విభేదాలు వచ్చాయని అందుకే ఈ వ్యవహారం విడాకులు వరకు వెళ్లి ప్రస్తుతం తన జీవితమే తలకిందులుగా మారిపోయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.