Samantha -Naga Chaitanya: టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని అక్కినేని ఇంట కోడలుగా అడుగుపెట్టిన నటి సమంత ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు. ఈమె నటుడు నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకొని అక్కినేని ఇంట కోడలుగా అడుగుపెట్టడంతో అభిమానులు సంతోషించారు. అయితే వీరి వైవాహిక జీవితం ఎక్కువ కాలం పాటు కొనసాగలేదని తెలుస్తోంది.

మూడు సంవత్సరాలు పాటు ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ దంపతులు విడాకులు తీసుకొని విడిపోవడంతో ఒక్కసారిగా సమంత నాగచైతన్య పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచారు.వీరి విడాకులకు సరైన కారణాలు తెలియకపోయినా వీరి గురించి నిత్యం ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వస్తూనే ఉంది. విడాకుల తర్వాత సమంత నాగచైతన్య ఇద్దరు కూడా వారి సినీ కెరియర్ పై దృష్టి పెట్టి వరుస సినిమాలలో నటిస్తున్నారు.
ఇకపోతే సమంత గత కొంతకాలంగా సోషల్ మీడియాకు దూరం కావడంతో ఎంతోమంది సమంత అనారోగ్య సమస్యతో బాధపడుతుందని అందుకే ఆమె సోషల్ మీడియాకు దూరంగా ఉంది అంటూ వార్తలు షికార్లు చేశాయి. అయితే ఈ వార్తలు నిజమేనంటూ సమంత సోషల్ మీడియా వేదికగా తాను మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నానని తెలియజేశారు. ఈ విధంగా సమంత తన వ్యాధి గురించి బయట పెట్టడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు.

Samantha -Naga Chaitanya: ఈ వ్యాధి కారణంగానే సమంత విడాకులు తీసుకుందా…
ఇలా సమంత ఈ వ్యాధితో బాధపడుతున్నారనే వార్తలు వినిపించడంతో సోషల్ మీడియాలో మరొక వార్త వైరల్ అవుతుంది. ప్రస్తుతం సమంత బాధపడుతున్న ఈ వ్యాధికి తన విడాకులకు కూడా ముడి పెడుతున్నారు. సమంత విడాకులకు ముందే ఇలాంటి వ్యాధితో బాధపడిందని అయితే ఈ వ్యాధి కారణంగానే వీరిద్దరి మధ్య విడాకులు వచ్చాయనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.సమంత ఈ విధమైనటువంటి వ్యాధితో బాధపడుతుందని తెలుసుకొనే ఆమె నాగచైతన్యతో విడాకులు తీసుకొని దూరంగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి.






























