Samantha: మరో ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసిన సమంత… ధర ఎంతంటే?

0
86

Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ప్రస్తుతం ఈమె వరస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా వరుస సినిమాలలో నటిస్తూ ఒక్కో సినిమాకు దాదాపు మూడు నుంచి నాలుగు కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్న సమంత భారీగానే ఆస్తులను కూడపెడుతున్నారు.

ఇప్పటికే చెన్నై హైదరాబాద్ ముంబై వంటి ప్రాంతాలలో ఖరీదైన ఇండ్లను కొలుగోలు చేసిన సమంత తాజాగా హైదరాబాద్లో మరోసారి ఖరీదైన ఇంటిని కొనుగోలు చేశారని తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం సమంత డూప్లెక్స్ హౌస్ కొనుగోలు చేశారని తెలుస్తోంది.

రంగారెడ్డి జిల్లా పరిధిలోని నానక్‌రామ్‌గూడలో జయభేరి ఆరెంజ్ కౌంటీలోని ఈ భవంతిని నల్లా ప్రీతమ్ రెడ్డి నుంచి రూ.7.8 కోట్లకు సమంత కొనుకుందనీ తెలుస్తోంది. ఓపెన్ ప్లేస్ పోను 7,944 ఎస్ఎఫ్‌టీ విస్తీర్ణంలో ఈ భవనాన్ని నిర్మించారు. ఇందులో ఆరు కార్ పార్కింగ్ స్లాట్లు కూడా ఉన్నాయని తెలుస్తోంది. ఇలా అన్ని సౌకర్యాలతో ఉన్నటువంటి ఈ ఇంటిని కొనుగోలు చేశారని తెలుస్తోంది.

Samantha: సినిమా షూటింగులతో బిజీ..


ఇలా సమంత భారీగానే ఆస్తులను కూడా పెడుతున్నట్లు సమాచారం. ఇక సమంత సినిమాల విషయానికి వస్తే సమంత ప్రస్తుతం ఖుషి సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. అదేవిధంగా సిటాడెల్ వెబ్ సిరీస్ లో కూడా నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా ఈ షూటింగ్ పనులలో సమంత బిజీగా గడుపుతున్నారు.