Samantha: సమంత ప్రస్తుతం వరుస సినిమాలు, సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈమె గుణశేఖర్ దర్శకత్వంలో నటించిన మొట్టమొదటి పౌరాణిక చిత్రం శాకుంతలం. ఈ సినిమా ఏప్రిల్ 14వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఇలా సమంత సైతం వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ సందడి చేస్తున్నారు.

ఇలా వరుస ఇంటర్వ్యూలలో పాల్గొన్నటువంటి స్వల్ప అస్వస్థతకు గురైనట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఈ విషయాన్ని ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. నేను మీ మధ్యలో ఉండి సినిమా ప్రమోట్ చేయాలని మీ ప్రేమతో తడిసి ముద్దవ్వాలనిఅనుకున్నాను అయితే ఈ బిజీ షెడ్యూల్ సినిమా షూటింగ్లో కారణంగా తాను కాస్త అస్వస్థతకు గురయ్యానని, జ్వరంతో బాధపడుతూ గొంతు కూడా మాట్లాడటానికి వీలు లేకుండా పోయింది. ఈ సాయంత్రం ఎమ్‌ఎల్‌ఆర్‌ఐటీ యానువల్ ఈవెంట్లో శాకుంతలం సినిమా టీంతో కలవండి. నేను మిమ్మల్ని ఎంతగానో మిస్ అవుతాను అని పేర్కొన్నారు.
ఇలా సమంత జ్వరంతో బాధపడుతున్నానని సోషల్ మీడియా వేదికగా తెలియచేయడంతో అభిమానులు కాస్త ఆందోళన చెందుతున్నారు. శాకుంతలం సినిమా విడుదలకు రెండు రోజులు సమయం ఉందనగా ఇలా సమంతకు అనారోగ్యం చేయడంతో అందరూ ఈమె ఆరోగ్యం పై ఆందోళన చెందుతున్నారు.బహుశా సమంతకు ఇంకా మయోసైటిస్ లక్షణాలు ఉన్నాయా అందుకే ఇలా బాధపడుతున్నారా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Samantha:జ్వరంతో బాధపడుతున్న సమంత…
కథకొద్ది రోజులుగా ఈమె మయోసైటిస్ వ్యాధితో బాధపడుతూ పూర్తిగా ఇండస్ట్రీకి దూరమైన సంగతి మనకు తెలిసిందే.అయితే ఈ వ్యాధి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సమంత తిరిగి వరుస సినిమాలు ప్రమోషన్లు అంటూ బిజీ అయ్యారు. ఈ నేపథ్యంలోనే ఈమెకు తిరిగి అనారోగ్యానికి గురయ్యారని తెలియజేయడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
(1/2)I was really excited to be amongst you all this week promoting my film and soaking in your love.
Unfortunately the hectic schedules and promotions have taken its toll, and I am down with a fever and have lost my voice.
— Samantha (@Samanthaprabhu2) April 12, 2023






























