విడాకులపై ప్రశ్నించిన రిపోర్టర్.. ‘నీకు బుద్ధి ఉందా’ అంటూ.. ఫైర్ అయిన సమంత..

0
787

గత కొంతకాలంగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న న్యూస్ చైతూ, సమంత విడాకుల విషయం. వీళ్లిద్దరి మధ్య ఏదో గొడవలు, మనస్పర్థలు జరిగాయని.. వీటిపై ఎన్ని వార్తలు వచ్చినా అందుకే స్పందించడం లేదంటూ వాదనలు వినిపిస్తున్నాయి. తాజాగా నాగచైతన్య లవ్ స్టోరీకి సంబంధించి ట్రైలర్ ను సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. దానికి సమంత రీ ట్వీట్ చేశారు. అదే సందర్భంలో హీరోయిన్ సాయి పల్లవిని, సినిమా టీమ్ సభ్యులను మాత్రమే యాష్ ట్యాగ్ ఇచ్చారు.

అందులో నాగచైతన్యకు యాష్ ట్యాగ్ ఇవ్వకపోవడంతో ఆ అనుమానాలకు బలం చేకూరినట్లు అయింది. ప్రస్తుతం వీరిద్దరూ విడివిడిగా ఉంటున్నారు. ఆ మానసిక వేదన నుంచి బయటపడేందుకే సమంత అనేక మార్గాలను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. సమంత తిరుమల శ్రీవారిని శనివారం దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించారు.

అంతేకాకుండా ఆమె శ్రీకాళహస్తిలోని జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయు లింగేశ్వరున్ని దర్శించుకున్నారు. అనంతరం స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. ఈ దర్శనానికి సమంత ఒక్కరే వచ్చారు.. అక్కినేని కుటుంబం నుంచి ఒక్కరు కూడా రాలేదు. ఇదిలా ఉండగా.. ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు సమంత ఘాటుగా సమాధానం ఇచ్చారు.

మీపై వస్తున్న రూమర్స్ గురించి మీ సమాధానం ఏంటని అడగ్గా.. బుద్ది ఉందా నీకు.. పవిత్ర గుడిలో అలాంటి ప్రశ్నలు ఏంటి అంటూ.. ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక వారిద్దరి మధ్య గొడవలు కారణంగానే ఎన్ని వార్తలు వచ్చినా స్పందించట్లేదని అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఇక ఆమె సినిమాల విషయానికొస్తే గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘శాకుంతలం’, తమిళంలో ఓ మల్టీస్టారర్ మూవీ చేస్తోంది సమంత.