సమంత నాగచైతన్య విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రకటించడంతో పెద్ద ఎత్తున వీరి గురించి సోషల్ మీడియాలో ఎన్నో కథనాలు వచ్చాయి.మరీ ముఖ్యంగా ప్రతి ఒక్కరు సమంత వ్యక్తిత్వాన్ని తప్పుపడుతూ వారు విడాకులు తీసుకోవడానికి సమంతనే ప్రధాన కారణం అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఆమె గురించి ట్రోలింగ్ జరిగాయి. ఇక సమంత వాటి గురించి పెద్దగా పట్టించుకోలేదనే చెప్పాలి.

విడాకుల విషయంలో సమంత తన మనసులో ఉన్న భావాలను కొటేషన్ రూపంలో ప్రతి రోజు ఒక పోస్టు ద్వారా వెల్లడించారు.ఇప్పటికే సమంత ప్రతి రోజు తన జీవితం గురించి ఏదో ఒక విషయాన్ని సోషల్ మీడియాలో తెలియజేస్తూ ఉంటారు. ఇక తన విడాకుల విషయాన్ని పూర్తిగా మరిచిపోయిన సమంత ప్రస్తుతం సినిమాలపై దృష్టి పెట్టింది.
ఇదిలా ఉండగా తాజాగా ఈమె ఓ ప్రఖ్యాత మ్యాగజైన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో విడాకుల గురించి.. దానిపై వచ్చిన ట్రోలింగ్ గురించి స్పందించింది. విడాకులపై ముందుగా తన మాటలతో అందరూ అంగీకరిస్తారని అనుకోవడం లేదని అలాగే తను పెట్టిన కండిషన్ కి అందరూ ఒప్పుకోవాలని నిబంధన కూడా లేదని తెలిపింది. మన అభిప్రాయాలు ప్రతి ఒక్కరికి నచ్చాలని కూడా ఏమీ లేదని అయితే మనం చేసే పని ఎంతో నిబద్ధతగా ఉండాలని తెలిపారు.
సాధారణంగా ఒక వ్యక్తి గురించి మరొక వ్యక్తికి మాట్లాడి తన గురించి చెడుగా చెప్పే హక్కు ఎవరికీ లేదు కానీ సమంత గురించి మాత్రం ఎంతోమంది ఎన్నో విధాలుగా కామెంట్లు చేస్తూ ఆమె వ్యక్తిత్వాన్ని తప్పుపట్టారు. అయినప్పటికీ ఈమె ఏ మాత్రం సహనం కోల్పోకుండా వాటన్నింటిని భరించి ముందుకు వెళుతుంది.ఇలా విడాకుల సమయంలో తన గురించి వచ్చిన ట్రోల్స్ పై స్పందించిన సమంత విడాకులకు కారణం ఏమిటి అనే విషయం మాత్రం వెల్లడించలేదు.































